బిఆర్ఎస్ దీక్ష దివస్ సభ సక్సెస్
ప్రజాదీవెన, నల్గొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ దీక్షా దివస్ సభ సక్సెస్ అయ్యింది. భారీ ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరైన ఈ దిక్ష దివస్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. 1996లోనే తెలంగాణ చర్చ మొద లైంది, ఆరోజే కెసి ఆర్ చెప్పాడు. నిర్మల్ కు చెందిన సత్య నారాయ ణగౌడ్ తో టీడీపీ లోనే ఉన్నపుడే ఆ ఆలోచన చేశారు. చంద్రబాబు అండ్ కో మీడియా దుర్మార్గపు ప్రచారం చేస్తునట్లుగా పదవీ కోసం కాదు రైతుగా తెలం గాణ కోసం ఆలోచించాడు.
తెలంగాణ వ్యవసా యాన్ని ప్రపంచ బ్యాంకుకు అప్పజెప్పినపుడు నేను అంగీకరించను అని కెసిఆర్ ఆనాడే చెప్పాడు.విద్యుత్ ఛార్జిల ను ఒప్పుకోను అని కెసిఆర్ చెప్పారూ. దానితోనే నేను బయ టికి వచ్చా మానసికంగా 8 నెలల పాటూ ఉద్య మకారులతో చర్చించి తెరాస ఏర్పాటు,నా ద్యేయం నా స్వప్నం తెలం గాణ అని ఆ నాడే ప్రకటించారు.చంద్రబాబు ఆనాడే కుట్రలకు తెరలేపారు.
కేంద్రంలోని బీజేపీ ఆయన చేతుల్లో ఉన్నది.ఆ రోజే పార్టీకి, పదవుల కు పదవులకు రాజీనామా చేసి వచ్చారు.కెసిఆర్ పై చంద్రబాబు దు ష్ప్రచారం చేసాడు. కానీ వీటిని చేదిస్తూ కెసిఆర్ ముందుకు సాగిం ది.ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ ద్వారా తెలంగాణ సాధించుకుందాం అని చెప్పారు. అహింస మార్గంలో సాధిద్దాం అని అందర్నీ ఒప్పించా రు.2004 ఎన్నికల్లో సోనియాగాంధీ ఇచ్చిన అవకాశంతో బిఆరెస్ పొత్తుకు సిద్దపడింది.
ఉద్యమాన్ని ఎన్ని అటుపోట్లు ఎదురైనా నిలబెట్టుకుంటూ వచ్చా రు.తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికాడు కాబట్టే రాష్ట్రం సాధిం చాం.ఉద్యమాన్ని అణిచివే సేందుకు అనేక కేసులు పెట్టారు. చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెట్టారు.ఇవ్వన్నీ చూసే నవంబర్ 29న కెసి ఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం తో కెసిఆర్ ఆమ రణ దీక్షకు సిద్దపడ్డారు. అయి తే పార్టీ నేతలు, శ్రేణులు వద్దని వారించారు.కానీ కెసిఆర్ మొండిత నం ముందు మేమే తలవంచక తప్పలేదు.ఆమరణదీక్షలోనూ కుట్రలు చేశారు.
నిమ్మరసం తాగినట్లు గా దీక్ష విరమంచినట్లుగా ప్రభు త్వం ప్రకటన చేసింది. కెసిఆర్ దీక్ష కొనసాగుతుంది అని కెసిఆర్ తరు పున నేను ప్రకటించిన,కెసిఆర్ దిక్ష విరమించకుండా మొండికి వేయ డంతో కేంద్రం దిగి వచ్చింది,కానీ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామ న్నారు.దీనికి కెసిఆర్ ఒప్పు కోలేదు. తెలంగాణ లేకుండా కెసి ఆర్ బయటకు రానూ అన్నారు,దీనితో కేంద్రం దిగిరాక తప్పలేదు దీనికి కెసిఆర్ దీక్షనే కారణం ఇది చరిత్ర.కానీ కెసిఆర్ దీక్షనూ అప్రతి ష్టపాలు చేసేలా దుస్ప్రచారం చేశారు.
సీమంద్ర ఎంపీలు, ఎమ్మె ల్యేలు ఒక్కటై డిసెంబర్ 23న అడ్డుకున్నా రు.జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొం డ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అధ్యక్షత వహించిన ఈ సభలో దీక్షా దివస్ ఇంచార్జి మహ బూబ్ నగర్ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ శాస నసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్, సీనియర్ నా యకులు, చకిలం అనిల్ కుమార్ చెరుకు సుధాకర్, పాల్వాయి స్ర వంతి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాలే శరణ్య రెడ్డి, రామచంద్రనాయక్, కటికం సత్తయ్య గౌడ్ బొర్ర సుధాకర్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నల్గొండ మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువన గిరి దేవేందర్ పలువురు మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు సర్పంచులు, ముఖ్య నాయకులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.
Brs kcr