Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brs ktr : విద్యార్థులవి మామూలు మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు

--బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

విద్యార్థులవి మామూలు మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు

–బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే తల్లి తండ్రిగా చూసుకుటుందని పిల్లలను తల్లితండ్రులు గురుకులాలకు పంపిస్తే ఇప్పటి వరకు 48 మంది పేద పిల్లలను పొట్టన బెట్టుకున్నా రని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి మామూలు మరణాలు కాదని, ప్రభుత్వం చేయించిన హత్యలు గానే భావిస్తున్నామని ఆరోపించారు. రాష్ట్రంలో దురదృష్ట వశాత్తు 20 రోజులుగా మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామా నికి చెందిన విద్యార్థి శైల జతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన తర్వాత గురుకు లాల్లో ఇప్పటివరకు చనిపోయిన 48 మం ది విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపు తున్నామ ని పేర్కొన్నారు.

నా నియోజకవర్గం ఎల్లారెడ్డి పేట్ లో ఓ విద్యార్థి గురుకుల పాఠశాల లో చని పోతే ఆకుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఆ తల్లి తండ్రులు తమలాంటి కడపుకోత వేరే వారికి రాకుండా పోరాడాలని కోరగా మేము ఆనాటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ గురుకు లాల వి ద్యార్థుల అంశాన్ని గుర్తు చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని, ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని, ఈ అంశాన్ని ఇక్కడితో వది లేయమని, ఆ కుటుంబాల తరఫున శాసనసభలో కూడా ప్రభుత్వా న్ని చీల్చి చెండాడుతామని స్పష్టం చేశారు.

కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవద్దని, నిబ్బరంగా ఉండాలని, ఆరోగ్యం బాగాలేకపోతే మే ము ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పిస్తామని బీఆర్ఎస్ ను సంప్రదించాలని సూచించారు. ముఖ్య మంత్రి రేవంత్ నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కార ణంగా మాట్లాడాల్సి వస్తోందని, రేవంత్ రెడ్డి (cm revanth re ddy ) నిన్నటి ప్రెస్ మీట్ లో అంతా ఫ్రస్ట్రే షన్, నిరాశ, నిసృహ స్ప ష్టంగా కనిపించిందని చెప్పారు.రాహుల్ గాంధీ తో తిట్లు పడిన త ర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వ స్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్ట మొచ్చినట్లు తిట్టాడని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, కావాల్సినంత దోపీడి జరుగుతోo దని ఇంకా ఎందుకు మమ్మల్ని తి డుతున్నాడో అర్థం కావటం లేద న్నారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టి నాయుడును చిప్ దొబ్బినట్లు అని పిం చిందన్నారు. మేము అదానీకి ( adhaani ) ప్రాజెక్ట్ లు ఇచ్చామం టాడు, ఎంపీగా కూడా పనిచేసిన ఈయన జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లు మేము ఇచ్చామంటాడు, ప్రజలను తక్కువ అంచనా వేస్తూ వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇంత తప్పుడు ప్రచారం చేస్తు న్నాడని దుయ్యబట్టారు. నువ్వు చెప్పే వాటిని ప్రజలు నమ్మరని, మీ డియా వారు కూడా ఎవ్వరూ కూడా నమ్మరని చెప్పారు. రక్షణ శాఖకు ఇచ్చిన ప్రాజెక్ట్ లు మేము ఇచ్చా మంటాడు.

రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా, మరీ రాజ్ నాథ్ సింగ్ ఏం చేస్తు న్నట్లు అని ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే అం టే ఇంత తెలివి తక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలి అని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్దాలను మీడియా మిత్రు లు కూడా ప్రశ్నించాలని, డ్రైపోర్ట్ కూ డా కేంద్ర, రాష్ట్రానికి సంబంధిం చిన అంశమని, కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, దాన్ని కూడా మేము ఎవ్వరికీ ఇవ్వలేదని, కానీ ఇచ్చినట్లు చూపించారని,చిట్టి నా యుడుకు ఏమీ తెలియదని, ఎవరన్న చెప్పిన వినడు, ఆయన మూ ర్ఖుడు అని వ్యాఖ్యానించారు.

మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు, రెండో సారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడు లు తెచ్చామని, కానీ ఈ ముఖ్య మంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడని, మై క్రో సాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పు డు ప్రచారం చేశాడని విమర్శించాడు. నీకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడి తే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మం టకలుస్తుందని హితవు పలి కారు.గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పా లు అయ్యావని, మైక్రో సాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చిందని, ఆమెజా న్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని, మొత్తం రూ. 67 వే ల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొచ్చామని గుర్తు చేశారు.

నేను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడని, బరాబర్ దావో స్ లో కలిశానని, ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్ లో పెట్టానని అన్నారు. నీలాగా ఇంటికి పిలిపించుకోని నాలుగు గంటలు రహస్యంగా కలవ లేదని, కోహినూరు హోటల్ లో కాళ్లు పట్టుకోలేదని, నాకు నీ లాగా లుచ్చా పనులు చేసే అల వాటు లేదని, ఏదీ చేసిన బజాప్తా చేప్తామ ని అగ్రహోదగ్రుడయ్యారు.అదానీ మేము అసలు ఎంకరేజే చేయలే దని, నీ లెక్కలుచ్చా పనులు చేసే ఆయన కాళ్లు ఒత్తుకుం టా ఉండే అలవాటు నాది కాదని, ఫ స్ట్రేషన్ లో నన్ను తిడున్నావ్ సరే నాకు ఏమీ ఫరక్ పడదని, ప్రశ్నిస్తే నేను సైకోనా అని హెచ్చరించారు.

కొండారెడ్డి పల్లిలో నీకోసం పనిచేసి న మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావని, మరీ నువ్వు శాడిస్ట్ వా అసలు నీకోసం పనిచేసి న పెద్ద మనిషి ఆత్మహత్య కు కారణమైన నువ్వు మనిషివేనా అని ప్రశ్నించారు. శైలజ అనే విద్యా ర్థి చనిపోతే వారి కుటుంబాన్ని పరా మర్శించేందుకు మా పార్టీ నేత కోవా లక్ష్మి వెళ్తూ ఉంటే ఆమెను హౌ జ్ అరెస్ట్ చేశారని, అనిల్ జా దవ్, జాన్సన్ నాయక్ లాంటి నేతలను కూడా అరెస్ట్ చేశారని, వాళ్లు పోతే నీకు ఏమైందయ్యా రేవంత్ అని ప్రశ్నించారు.

ఇంటర్ నెట్ షట్ డౌన్, అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు ఇదే ప్రజా పా లనా అన్నారు. ఏడాది నీ పాలనలో అదానీ, అల్లుడు, అన్న, బావ మరది సృజన్ రెడ్డికి అమృతం పంచటం కోసం తప్పా, నువ్వు పీకిం దేంటీ అని అడిగారు. అసలు అదానీ చెక్ ఇచ్చి 38 రోజులు అయిన ప్పటికీ ఇప్పటి వరకు ఎం దుకు క్యాష్ చేయలేదని, అంటే చెక్ చూ పించి వెనక నుంచి ఆ డబ్బులు దొబ్బేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిం చారు. అదానీ ఫ్రాడ్ అని రేవంత్ రెడ్డికి నిన్ననే తెలిసిందా, మహారా ష్ట్ర ఎన్నికల ప్రచారం లో అదానీని గజదొంగ అంటివి, మహారాష్ట్రలో గజదొంగ ఇక్కడ సుద్దపూస అయ్యిండా అని ప్రశ్నించారు.

ఆయన చెక్ ఇవ్వలేదు, అది క్యాష్ కాలేదు, ఏదో తమాషా చేసిండని ధ్వజమెత్తారు.అదానీతో రూ. 12,440 కోట్ల పెట్టుబడులు అని చె ప్పారని, అందులో పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంట, అసలు తెలంగాణ లో పంప్డ్ స్టోరేజీ పాలసీ ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చె ప్పిన వాటిల్లోనే రెండు అంశాలు బయటపడ్డాయని, రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ పాలసీ లేదు, అదే విధంగా కొడంగల్ లో అల్లుడు కోసం అ నుకున్నాం, కానీ ఇప్పుడు అదానీ కోసం తెలిసిందన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేటలో సిమెంట్ ప్రజలు వద్దన్న ప్పటికీ పెడుతూ మూసీని కలుషితం చేస్తారంట, మళ్లీ కొడంగల్ లో కూడా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతారంట, నేను ప్రశ్నిస్తే సైకోనా తెలంగాణ వనరులను దొంగకు దోచిపెడితే మరి నువ్వు దొంగవా అ డిగారు.అదానీ రాష్ట్రం వదిలి వెళ్లాడు అని సీఎం అనుంగ పేపర్లోనే వార్త వ చ్చింది. ఏదో నిన్న రాహుల్ గాంధీ ఫోన్ చేసి తిట్లు తిట్టటం తో అట్ల యాక్షన్ చేశారని ఎద్దేవా చేశారు.

అదానీ వ్యవహారానికి సంబంధించి రెండేళ్ల కిందటే హిండెన్ బర్గ్ రి పోర్ట్ వచ్చిందని, రాహుల్ గాంధీ ఏమో అదానీ దొంగ అని అంటుం టాడు, రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో రూ. 12, 400 కోట్ల ఒప్పం దాలు చేసుకుంటడు, ముఖ్యమంత్రి ఇంటి పేరును అనుముల కాద ని, అబ ద్దాలు రేవంత్ అని మార్చుకోవాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్ లను మేము ఇచ్చామంటూ చెబుతున్నావ్ నీకు ఏమై నా పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు.కేసీఆర్ ఏం తప్పు చేసిండని ఆయ నను తిడుతున్నావ్, అదానీ కి రెడ్ సిగ్నల్ ఇవ్వటమే కేసీఆర్ చేసిన తప్పా, బొగ్గు పాలసీని విషయంలో దేశంలో కేంద్రాన్నినిలదీసి న ఒకే ఒక్కడు కేసీఆర్ అని నిలదీశాడు.

నీ లాగా కాళ్లు పట్టుకోవటం, లుచ్చా పనులు చేయటం, మస్కా కొట్ట టం, గౌతమ్ భాయ్ అంటూ చుట్టూ తిరిగే రకం మేము కాదన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ చేసి తిట్లు తిడితే డ్యామేజ్ కంట్రోల్ కోసం మొ త్తానికి వెనక్కి తగ్గావ్ అంటూ, బీఆర్ఎస్ దెబ్బకు గత్యం తరం లేక ఫీచేముడ్ అన్నందుకు సంతోషమని చెప్పారు. కానీ అదా నీతో మొ త్తం ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, అప్పుడు మాత్రమే నిన్ను, నీ రాహుల్ గాంధీని ప్రజలు నమ్ముతారని డిమాండ్ చేశారు.

మూసీ ప్రాజెక్ట్ ను కూడా ఏ పాలసీ లేకుండా ఏ విధంగా ఇస్తారని, నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ము ఖ్యమంత్రివి నీవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తావో చేసు కో, నీకు భయపడేవాళ్ల కాదు మే ము అని సూచించారు. మీడియా మిత్రుడు ఒకరు నిన్న మేఘా సంస్థ ను బ్లాక్ లిస్ట్ పెట్టాలని హైద్రా బాద్ వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని ప్రశ్నిస్తే ఎవడో పుల్లయ్య, మల్ల య్య చెప్పిండు అంటాడని ఎల్లయ్య, మల్లయ్య చెప్పలేదని, ప్రభు త్వం లోని నీ శాఖనే చెప్పిందన్న సోయి కూడా లేదా అని అడిగారు.

ముఖ్యమంత్రికి అంతా కన్ ప్యూజనే, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తుంటే మీడియా ఆ ట్రాప్ లో పడవద్దని హితవు పలికారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి శృతి ఉందా, ఆ యన పిచ్చోడా, ఈయన పిచ్చోడా తేల్చుకోవాలని సూచించారు. అ దానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ ప్రపంచం మొత్తం తిరిగి చెబుతా డని, రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి రెడ్ కార్పేట్ వేసి స్వాగతం ప లుకుతాడని వివరించారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే మంచిదే కానీ 28 సార్లు ఢిల్లీకి పో యి రూ. 28 కూడా తేలేదని ఆరోపించారు.నువ్వు పెద్ద బృందం తో వెళ్లి పెట్టిన ఖర్చు కూడా పడ్తల్ కాకపోతే ఎట్లా, బీజేపీతో చీకటి ఒ ప్పందం, రాహుల్ గాంధీని కలిసి ఆయనకు మూటలు ఇచ్చి కుర్చీ కాపాడుకోవటానికే నువ్వు ఢిల్లీకి వెళ్లేదoటూ విమర్శించారు. అంతే తప్ప ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి పోతలేడని వ్యాఖ్యా నించారు.

Brs ktr