Brs mlajagadishreddy : ఒక్కటంటే ఒక్క సొంత పని ప్రారంభించలేదు
--అన్ని పనులు కేసీఆర్ ముందు చూపుతో సాక్షాత్కారమైనవే --కొత్త పనులకు శంకుస్థాపన చేసు కునే దమ్ములేని జిల్లా మంత్రులు --ఉమ్మడి జిల్లాలో దీర్ఘకాలిక సమ స్యలన్నీ కెసిఆరే తీర్చారు -- నల్లగొండ సీఎం పర్యటనపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ఒక్కటంటే ఒక్క సొంత పని ప్రారంభించలేదు
–అన్ని పనులు కేసీఆర్ ముందు చూపుతో సాక్షాత్కారమైనవే
–కొత్త పనులకు శంకుస్థాపన చేసు కునే దమ్ములేని జిల్లా మంత్రులు
–ఉమ్మడి జిల్లాలో దీర్ఘకాలిక సమ స్యలన్నీ కెసిఆరే తీర్చారు
— నల్లగొండ సీఎం పర్యటనపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: నల్లగొండ ఉమ్మడి జిల్లాకు సంబం ధించి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ అభాసుపాలైoదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరి ట పలు ప్రారంభోత్సవాలు కోసం నల్లగొండ వచ్చి చేసిన సభ ప్రసం గం హాస్యాస్పదమని వ్యా ఖ్యానించారు. ఆదివారం నల్లగొండ బీఆ ర్ఎస్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశం లో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్య, కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్ల బోతు భాస్కర్ రావు, నోముల భగత్ ,జెడ్పి మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మ న్ మందడి సైదిరెడ్డిలతో కలిసి మాట్లాడారు.
అట్టహాసంగా నల్లగొండ పర్యటన కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరికి కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన పనులను ప్రా రంభోత్సవాలు చేశారన్నారు. జిల్లా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు ఒక్కటంటే ఒక్క రూపాయితో చేప ట్టిన సొంత పను లకు కనీసం శంకుస్థాపన చేసే దమ్ము లేదని దుయ్యబ ట్టారు. కేసీ ఆర్ కలల ప్రాజెక్టు, దేశంలో అతి పెద్దదైన యాదాద్రి థర్మ ల్ పవర్ ప్రాజెక్టును కట్టుకున్నామని, అదంతా కేసీఆర్ విజన్, ముం దు చూపు అని తేటతెల్లమైందని గుర్తు చేశారు.
2027 నాటికి 24 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకోవాలని టార్గెట్ గా పని చేసినమని, కేసీఆర్ చేసిన కృషితో పట్టుదలతో యా దాద్రి ప్లాంట్ పూర్తి చేసినమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే శని గ్రహమని కాంగ్రెస్ హయాంలోనే ఫ్లోరైడ్ మహమ్మారి విజృభించి మా న వాళికి పెను ప్రమాదంగా నిలిచిందని, అలాంటి మహమ్మరిని కేసీ ఆర్ భగీరథ నిటితో రూపు మాపారని తెలిపారు.
నల్లగొండ జిల్లా మంత్రి మతిస్థిమితం లేకుండా మాట్లాడాతున్నాడని, యాదాద్రి ప్లాంట్ ను కులగొడతామంటూ ప్రగల్భాలు పలికాడని, అప్ప టి ఎన్ జి టి కేస్ ల లో కోమటిరెడ్డి ప్రమేయం ఉందేమో అని అను మానం కలుగుతుందని వ్యా ఖ్యానించారు. నిన్నటి రోజున కూడా యాదాద్రి ప్లాంట్ ప్రారం భోత్సవాన్ని అడ్డుకుంటాడేమో అను కున్నాము కానీ బుద్ది తెచ్చు కొని ఆ పని చేయలేదని ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వo యాదాద్రి ప్లాంట్ కు,మెడికల్ కాలేజీకి ఒక్క రూ పాయి కూడా ఇవ్వలేదని, కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధు లతోనే అవి పూర్తి చేసినమని కేసీఆర్ వ్యవసాయ రంగంపై తీసుకు న్న సంచలనాత్మక చర్యలతో నల్లగొండ జిల్లా అధిక మొత్తంలో లబ్ది పొందిందని అన్నారు. నేడు రాష్ట్రoలో 30 వేల కోట్లు అన్నదాతలకు ఏగ్గొట్టారని, రైతు లకు రూ. 12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశా రని, నిన్న రేవంత్ సభలో మాట్లాడుతుంటేనే ప్రజలు సభ నుంచి వెళ్లిపోతున్నారని అప్పుడు మా కేసీఆర్ వస్తుంటే ప్రజల్లో ఉత్సాహం పెల్లుబికేదని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి కి ఏతులు ఎక్కువ అయ్యాయని, మేము ఇచ్చిన ఉద్యో గాలను రేవంత్ సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుం టున్నాడని, ఉదయ సముద్రం ప్రాజెక్టును కూడా మేమే ట్రయల్ రన్ చేసి నీళ్లు ఎత్తి పోసినమని, దాన్ని మళ్ళీ నిన్న ట్రయల్ రన్ చేసి నానా హంగా మా చేసిన మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అల్ప సంతోషిగా నిలిచా రని వ్యా ఖ్యానించారు. అసలు వాస్తవాలు అన్ని ప్రజలకు తెలుసున ని, ఎస్ ఎల్ బి సి ప్రాజె క్టు లో టిబిఎమ్ మిషన్ ను కుట్ర పూరితం గా తెచ్చింది ఎవరో ప్రా జెక్టు ఆలస్యానికి కారణం ఎవరో త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తానని, మూసి ప్రక్షాళన సైతం మేమే మొ దలు పెట్టామని అంటూ అసలు నల్లగొండ ను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని వ్యవసాయంను ఆగం చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు.
నల్లగొండ కు గోదావరి జలాలను తెచ్చింది కేసీఆర్ అని ఇవ్వాళ గో దావరి నీళ్లను బంద్ పెట్టింది మాత్రం కాంగ్రెస్ నాయ కులు అని ఆరో పించారు. కాళేశ్వ రం తోనే రాష్ట్రంలో ధన్యం దిగుబడులు గణనీ యంగా పెరిగాయని, కాళేశ్వరం గొప్పతనం కాంగ్రెస్ మూర్ఖులకు అర్థం కాపోవడంతో నల్ల గొండ జిల్లా ఐదేళ్లు వెనక్కి పోయిందని, జిల్లా మంత్రులు దద్దమ్మ ల్లాగా పలాయనం చిత్తగిస్తున్నారని విమ ర్శించారు. అసలు అభివృద్ధి అంటే ఏంటో వీళ్లకు తెలియదని అంటూనే జిల్లాను దోచుకొని మం త్రులు జేబులు నింపుకుటు న్నారని విమర్శించారు.
కేసీఆర్ ప్రజల గుండెల్లో వున్నారని, కేసీఆ ర్ ప్రజల మనసుల్లో గూ డు కట్టుకున్నారని, రేవంత్ కి కేసీఆర్ అంటేనే వణుకు వస్తున్నదని, కాంగ్రెస్ మా త అనే విగ్రహన్ని వాళ్ళు పెట్టు కుం టున్నారని, కాని మేము మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ మాత మాకు న చ్చలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంత మాత విగ్రహం తర హాలో ప్రతిష్టించబో తున్న విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దని బిఆ ర్ఎస్ పార్టీ అంగీ కరించటం లేదని ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీ చెం దిన తెలం గాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించేది లేదంటూ బహిరం గంగానే వ్యతిరేకి స్తున్నారని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, కల్లు గీత కార్మిక సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్,మాజీ మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ రెగ ట్టే మల్లిఖార్జున రెడ్డి, మాజీ ఆర్వో మాలే శరణ్యా రెడ్డి, నల్లగొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కరీం పా షా, బక్క పిచ్చయ్య, సింగం రా మ్మోహన్,కొండూరి సత్యనారా యణ,లోడంగి గోవర్ధన్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేం దర్, తిప్పర్తి,కనగల్,నల్గొండ, నార్కెట్ పల్లి, మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగొని యాదయ్య, దేప వెం కట్ రెడ్డి,బైరెడ్డి కరుణాకర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ మారగోని గణేష్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి, మెరుగు గోపి, చెర్వు గట్టు మాజీ చైర్మన్ మేకల రాజి రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి మాజీ సర్పంచులు, కడారి కృష్ణ య్య సిరిగిరి వెంకట రెడ్డి, కోట్ల జయపాల్ రెడ్డి,విద్యార్థి నాయకులు బొమ్మర బోయిన నాగార్జున, కట్ట శ్రీను, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
Brs mlajagadishreddy