BRS Party : ప్రజాదీవెన నల్గొండ టౌన్ :బి ఆర్ ఎస్ పార్టీ రజోత్సవం సందర్భంగా ఆదివారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలలు వేసి జెండా ఎగురవేసారు. అనంతరం, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వంలో నల్లగొండ నియోజకవర్గం నుండి 200 పైగా వాహనాల్లో వరంగల్ రజితోత్సవ బహిరంగ సభకు తరలి వెళ్లారు.
జిల్లా పార్టీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో.. జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తో పాటు.. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్ కుమార్, కటికం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, నిరంజన్ వలి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమాన్యూ శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీందర్ రావు, మారగోని గణేష్, రావుల శ్రీనివాస రెడ్డి, మెరుగు గోపి, సయ్యద్ జాఫర్, జమాల్ ఖాద్రి,తదితరులు పాల్గొన్నారు.