Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

మరో ఎమ్మెల్యే పార్టీ వీడే అవకాశం
సీఎంను కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరిక..?

ప్రజాదీవెన, హైదరాబాద్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్(BRS) కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాను త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సీఎం(CM)కు ఆయన చెప్పినట్లు సమాచారం. మరో 2 రోజుల్లో అనుచరులతో కలిసి తాను హస్తంలో చేరనున్నట్లు చెప్పారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ సైతం వారి బాటలోనే హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయన సీఎం రేవంత్ ను కలిశారు.

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
మరోవైపు, వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బీఆర్ఎస్ కు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపారు. ‘ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ (BRS)సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్టానం నన్ను అవమానించింది. మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అందుకే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా.’ అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

BRS Party Leaders resigned