Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Talasani : పెద్దగట్టులో మాజీమంత్రి తలసాని ప్రత్యేక పూజలు

BRS Talasani : ప్రజా దీవెన సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పెద్దగట్టు ప్రాంతం అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ హయాంలోనే జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలి పారు. మంగళవారం సూర్యాపేట సమీపంలోని దూరాజ్ పల్లి లో జరుగుతున్న పెద్దగట్టు జాతరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో కలిసి జాతరను సందర్శించారు. మార్గమధ్యలో దారిపొడవునా యాదవ సంఘాల నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్దగట్టు వద్ద యాదవ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లింగమంతుల స్వామివారి ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యా దవ్ ను సత్కరించి జ్ఞాపికను అంద జేశారు. ఈ సందర్భంగా విలేక రులతో మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రం లో జరిగే రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతర అని తెలిపారు.

రెండు సంవత్సరాలకు ఒకసారి జ రిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నా రు. వచ్చే భక్తులను దృష్టి లో ఉం చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం14 కోట్ల రూపాయలు మంజూరు చేసి అనేక అభివృద్ధి పనులు చేపట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతర నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించిందని, వాటిలో ఎన్ని నిధు లు ఖర్చు చేశారని ప్రశ్నించారు. జా తర నిర్వహణ ఏర్పాట్లు సక్రమంగా లేవని, పారిశుద్ధ్య నిర్వహణ సరి గా లేకపోవడం వలన వెలువడే దు ర్వాసనతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఈ నెల 20 వరకు జాతర జరుగుతుందని, ఈ రోజు నుండైనా వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని అన్నారు. మా జీమంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్ వెంట బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గుప్తా, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచ ర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బా లరాజ్ యాదవ్, పలువురు యా దవ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఉన్మారు.