Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brs : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన

Brs : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగా నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పట్టణం లోని ఎమ్మెల్సీ ఓటర్లను ప్రభావితం చేయడానికి మరియు భయభ్రాంతులకు గురిచేశా రంటూ స్థానిక మున్సిపల్ కమిషనర్ కు వెంటనే ఫ్లెక్సీలు తొలగించాలని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించి తన విధులను విస్మరించినారు. ఫ్లెక్సీలను తొలగించకుండా వారికి వత్తాసు పలికే విధంగా ప్రవర్తించినాడు.

 

 

 

ఈ అధికారుల ఎన్నికల్లో కొనసాగితే ఎన్నికల న్యాయబద్ధంగా, సక్రమంగా జరవగని ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కావున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, అతనిని వెంటనే విధుల నుండి తొలగిం చాలని కోరుతూ భారత ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు, జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.