శ్రీకాంతాచారి ఆశయ సాధనకు కృషి చేయాలి
–నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన నల్లగొండ టౌన్: అమరుడు శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం తోనే తెలంగాణ ఉద్యమం మరింత బలపడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూల మని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరుడు కాసోజు శ్రీకాంతాచారి అని గుర్తు చేశారు.
శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ మాజీ శాసనస భ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పెద్ద గడి యారం సెంటర్ లో ని విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివా ళులర్పించారు.ఈ సం దర్భంగా మాట్లాడుతూ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమోనని తన ప్రాణం త్యాగంతోనైనా ప్రత్యేక తెలం గాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ఆశించి ప్రాణ త్యాగం చేశారని వివరిం చారు.
అందుకు తెలంగాణ రాష్ట్రం వారికి జోహార్లు అర్పిస్తుం దని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ నా యకత్వంలో గత పది సంవత్స రాలు తెలంగాణని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం గా తీర్చిదిద్దారని తెలి పారు.కానీ గత శాసనసభ ఎన్నిక ల్లో మార్పు కోరుకున్న ప్రజలు సం వత్సరం తీరగకుండానే తెలంగాణని ఇబ్బం దుల పాలు చేశారని, అ న్ని వర్గాల ప్రజల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారన్నారు.
అమరవీరుల ఆశయాలు ఫలించాలంటే, మళ్లీ కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వ మే రావాలని,రాబోయే రోజుల్లో ప్రజలు. బిఆర్ఎస్ పార్టీకి, కెసిఆర్ నాయకత్వానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందించి మద్ద తు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలోమున్సిపల్ ఫోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సిం గం రామ్మోహన్, కౌన్సిలర్ మారగో ని గణేష్, కో ఆప్షన్ సభ్యులు జ మాల్ ఖాద్రి రంజిత్,కౌకూరి వీరా చారి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీని వాస రెడ్డి,మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య,ఊట్కూరు సందీప్ రెడ్డి, బొజ్జ వెంకన్న దొడ్డి రమే ష్, హసన్ సలీమ్, షబ్బీర్, మొయిజ్, రుద్రక్షి వెంకన్న, కంకణాల వెంకట్ రెడ్డి వీర మల్ల భాస్కర్, అవినాష్ కన్నబో యిన సతీష్, మెం డు చంద్రశేఖర్ రెడ్డి గాదె వివేక్ రెడ్డి విద్యార్థి నాయ కుడు ప్రణీత్,చక్రి అక్కినేపల్లి గణేష్ పుట్టకోటయ్య విజయ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Brsbupalreddy