Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brsjagdishreddy : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సరికాదు

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సరికాదు

— తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో చరిత్రలో ఓ చీకటి రోజు
— సభాపతి పేరుతో రాజకీయాలు చేయడం దారుణం
— కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా ఖూని చేస్తోంది
— నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Brsjagdishreddy:  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా గొంతెత్తిన మాజీ మంత్రి, సూర్యాపే టశాసనసభ్యు లు గుంటకండ్ల జగ దీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం అప్ర జాస్వామిక చర్య గా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభివర్ణిం చారు. గురువారం స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియా రం చౌస్తాలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా భార త రాష్ట్ర సమితి నల్లగొండ నియో జక వర్గం ఆధ్వర్యంలో నిరసన కా ర్యక్రమం నిర్వహించారు. జగదీష్ రెడ్డి పైన తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కం చర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సభలో జగదీశ్ రెడ్డి మాట్లాడు తు న్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు పదేప దే అడ్డు తగులుతున్నా సభాపతి వారిని నియంత్రణ చేయలేకపోయారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి ఈ సభ ప్రజా సమస్యల పరిష్కారా నికి వేదిక కావాలని కెసిఆర్ దిశా నిర్దేశం లోపల ప్రసంగిస్తున్న జగదీ ష్ రెడ్డిని అక్రమంగా అనైతికంగా సస్పె న్షన్ చేశారని ఇది రాజ్యాం గాన్ని ఖూనీ చేయడంలో భాగమేనని వారన్నారు.

రైతు రుణమాఫీ గురించి,ఎండిపోతున్న పంటల గురించి, రైతుబం ధు గురించి లేవనెత్తిన అంశాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం జగదీశ్ రెడ్డి గొంతు నొ క్కాలని కుట్రపూరితంగా నాలుగు గంటలు అసెంబ్లీ సమావేశం ఆపి అన్ని రకాలుగా చర్చించుకొని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి పథకం ప్రకారం అసెంబ్లీ స మావేశాల నుండి సస్పె న్షన్ చేశారని ఇది కుట్రపూరితమైన చర్యని వారన్నారు. సభ మన అం దరిదని, ఈ సభకు పెద్ద మనిషిగా మీరు వ్యవహరిస్తున్నారని ఈ సభను మీరు సొంతంగా భావించ వద్దని సభాపతిని ఉద్దేశించి జగదీ శ్ రెడ్డి అనడం ఏ సభా నియమా లకు వ్యతిరేకమో నిరూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో అసలు కులం ప్రస్తావన రాలే దని,కావాలనే పదే పదే దళిత స్పీకర్ అని కాంగ్రెస్ సభ్యులే సభాప తిని అవమానించే విధంగా మాట్లాడారని వారన్నారు. జగదీశ్ రెడ్డి రాష్ట్రం లోపల అనేక మంది దళిత నేతలను వెన్నుతట్టి ప్రోత్సహిం చారని వారన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ జనరల్ మ హిళా స్థానంలో బి.సి మహిళను మున్సిపల్ చైర్మన్ గా చేసిన ఘన త జగదీశ్ రెడ్డి ది అని గుర్తు చేశారు.

జగదీష్ రెడ్డి మాట్లాడిన విషయంపై క్లారిటీ ఇచ్చుకోవడానికి కూడా సభాపతి అవకాశం ఇవ్వకపోవడం దారుణం అన్నారు.తెలంగాణ ఉ ద్యమ సమయంలో స్పీకర్ పోడి యాన్ని చుట్టుముట్టి తీవ్రమైన ఆం దోళనలు చేసినా ఇంత దారుణా నికి ఒడిగట్టలేదన్నారు.స్పీకర్ ను అడ్డం పెట్టుకొని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడంలో భాగమే అన్నా రు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందన్నారు. ఇలాంటి సస్పెన్షన్ల ద్వారా ప్రజా ఉద్యమాలను, ప్రజా గొంతుకలను నిలువరించలేరన్నారు. ఉద్యమ పార్టీ అయినా భారత రాష్ట్ర సమి తికి ఇవి కొత్తేమి కావన్నా రు. కాంగ్రె స్ ఉడుత ఊపులకు భయ పడేది లేదన్నారు.కెసిఆర్ నా యకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాల పై మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైది రెడ్డి, అభిమన్యు శ్రీ నివాస్, సింగల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్ మం డల పార్టీ అధ్యక్షులు ఐతగొని యా దయ్య, సింగం రామ్మోహన్, కొం డూరి సత్యనారాయణ మాజీ ఎం పీపీ కరీం పాషా, బొజ్జ వెంకన్న మాజీ జెడ్పిటిసి తుమ్మల లింగ స్వామి, జమాల్ ఖాద్రి, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, మెరు గు గోపి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, శంషోద్దీన్ దొడ్డి రమేష్, రత్నగిరి శ్రీనివాస్ మాతంగి అమర్, కుం దూరు ప్రవీణ్ రెడ్డి,కంకణాల వెంకటరెడ్డి, వీరమల్ల భాస్కర్ పేర్ల అశోక్ పెఱిక యాదయ్య.. విద్యార్థి నాయకులు బొమరబోయిన నాగార్జున,అంబటి ప్రణీత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.