BRSkcr : ప్రజా సమస్యలపై గళమెత్తండి
--ప్రభుత్వ వైపల్యాలను ఎండగ ట్టేందుకు ప్రధమ ప్రాధాన్యం --నేనూ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా -- బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం లో అధినేత కేసీఆర్
ప్రజా సమస్యలపై గళమెత్తండి
–ప్రభుత్వ వైపల్యాలను ఎండగ ట్టేందుకు ప్రధమ ప్రాధాన్యం
–నేనూ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా
— బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం లో అధినేత కేసీఆర్
BRSkcr: ప్రజా దీవెన, హైదరాబాద్ :ప్రజా సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతి ఒక్క స భ్యుడు గళమెత్తాల్సిన అవస రం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజా సం క్షేమమే ధ్యే యంగా ప్రభుత్వ పనితీరును అసెం బ్లీలో, మండలిలో ఎండగ ట్టాలన్నా రు. తెలంగాణ భవన్లో మంగళ వారం కేసీఆర్ అధ్యక్షత న జరిగిన శాసనసభాపక్షం భేటీలో పార్టీ ఎమ్మె ల్యేలు, ఎ మ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలిలో పార్టీ సభ్యులు అనుసరించాల్సి న అంశంపై దిశా నిర్దేశం చేశారు.
తాను కూడా అసెంబ్లీ సమావేశాల కు హాజరుకానున్నట్లు ఈ సంద ర్భంగా సభ్యులకు తెలిపారు. రెచ్చ గొడితే రెచ్చిపొవద్దని, ఆలోచించి మాట్లాడాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ లకు 42శాతం రిజర్వేషన్లపై బిల్లు లు ప్రవేశపెట్టాలని, ఈ నెల 6వ తే దీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతి నిధులకు వివరించి, అం దుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ, తదితర అంశాలపై కూడా మార్గ నిర్దేశం చేశారు. ప్రభు త్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభు త్వంపై వత్తిడి తీసుకురా వాలని బీఆర్ఎస్ నేతలను కోరారు. అలా గే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ప్రతి అంశంపై పట్టు పెంచుకోవాలని సూచించారు. ఇక సభలో ఎవరు రెచ్చగొట్టిన రెచ్చి పోవద్దన్నారు. ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టేం దుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.బి ఆర్ ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీ త సమయానికి హాజరు కావాల న్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీ ల్చి చెండాడాలన్నారు. బిఆర్ ఎస్ మీద రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న త ప్పుడు నిందలను తిప్పి కొట్టాలి. రాష్ర్టంలో నెలకొన్న పలు సమ స్య లు ఎండిన పంటలు, అందని కరెం టు, అందని సాగునీరు, కాలి పోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెం బ్లీ లో మండలి లో పోరాడాలని సూచించారు. బీసీ రిజర్వే షన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలన్నా రు.
రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరు పై మాట్లా డాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యో గుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిఎల పెండింగు పీఆర్సీ అమలు పై అసెం బ్లీ మండలి వేదికగా ప్రభుత్వా న్ని నిలదీయాలన్నారు. మహిళలకి చ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలన్నారు. ఆరు గ్యారంటీ ల అమలు లో ప్రభుత్వం అనుసరి స్తు న్న మోసపూరిత వైఖరిని నిలదీ యాలన్నారు. విద్యార్థుల ఓవ ర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పో వడం గురించి, వైద్య రంగం లో దిగ జారుతున్న ప్రమాణాలు తదితర సమస్యలను ఎండగట్టా లని సూచించారు.
దళిత బంధును నిలిపి వేతపై ప్రశ్నించాలని, గొర్రె ల పెంపకం చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మండలి లో ప్రభు త్వాన్ని నిలదీయాలని, కాంగ్రెస్ ప్ర భుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ప డుతు న్న కష్టాలను, వారి ఆకాంక్షల ను అర్థం చేసుకొని వారి గొంతుకగా బి ఆర్ ఎస్ సభ్యులు ఉభయ సభ ల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని అధి నేత కేసీఆర్ ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది.
ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయిం చింది.సభల్లో ఇంకా ప్రతిభావంతం గా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యు లను ఎప్పటిక ప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడ ర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. బిఆర్ ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా శాసన మండలి సభ్యులు, శాసన సభసభ్యులు పాల్గొ న్నారు.