Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSktr : తెలంగాణ దశదిశ మార్చి తరగని ఆస్తులు సృష్టించాం

--బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువా త కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రo --మేం చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చాం --దేశచరిత్రలోనే అత్యధికంగా అ ప్పులు మీరా మాపై అభాండాలు వేసేది --కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ కు కేటీఆర్ బహిరంగ లేఖ

తెలంగాణ దశదిశ మార్చి తరగని ఆస్తులు సృష్టించాం

–బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువా త కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రo
–మేం చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చాం
–దేశచరిత్రలోనే అత్యధికంగా అ ప్పులు మీరా మాపై అభాండాలు వేసేది
–కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ కు కేటీఆర్ బహిరంగ లేఖ

BRSktr:  ప్రజా దీవెన, హైదరాబాద్: స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు.

2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70 వేల కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా రు. అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్ కు అప్పజెప్పామని కేటీఆర్ తే ల్చిచెప్పారు. అసలు అప్పులను, మిగులు బడ్జెట్ తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని గుర్తు చేశారు.

సమైక్యరాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రా న్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలో నే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టు గా చిత్రీకరించే ప్రయత్నం సరైంది కాదని స్పష్టంచేశారు. తెచ్చిన అ ప్పులను దేనికోసం ఖర్చుపెట్టారనేదే అత్యంత కీలకమైన విషయమ న్నారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అ ప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో దశాబ్దాలపాటు ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ను నిర్మించామని తెలిపారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని వెంటాడిన చిమ్మచీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, మరోవైపు రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విష యం తెలంగాణ సమాజానికి తెలుసని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.

బీఆర్ఎస్ హయాంలో..ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి లోబడి చేసిన అప్పును తప్పుగా చూపించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ ని కేటిఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెచ్చిన అప్పులతో కార్పొ రేట్ శక్తుల లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకో వాల ని కోరారు. పంటల దిగుబడిలో పం జాబ్ నే తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం తెచ్చిన అప్పులతో సంపద సృష్టించే బృహత్తర కార్యక్ర మాలు చేపట్టడమేనని కుండబద్దలు కొట్టారు.

అటు కేంద్ర బడ్జెట్ లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రే మ కనబరుస్తోం దని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రాగా నే తెలంగాణలోని ఏడుమండలాలను, లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజె క్టును లాక్కొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతుకోసిన విషయాన్ని పదే ళ్లు గడిచినా తెలంగాణ ప్రజలు మరిచి పోలేదని కేటిఆర్ పేర్కొ న్నా రు. కేంద్రం ఖజానా నింపే తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వా టాను ఇవ్వాలని, విభజన హక్కులను నెరవేర్చాలని అడిగిన పాపా నికి కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో..కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినం దుకు తెలంగాణకు మీరిచ్చే బహుమా నం ఈ అవమానాలేనా అని కేటిఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా, కేవలం మాట లకే పరిమితం కావడం అత్యంత దారుణమన్నారు. బోర్డు చైర్మన్ కు కనీసం కూర్చోవడానికి కార్యాలయం కూడా ఇవ్వకపో వడం, పసుపు బోర్డు పట్ల కేంద్ర ప్రభుత్వానికున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దుచేసిన ఐటీఐఆ ర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని పదేళ్లలో పదులసార్లు మొరపె ట్టు కున్నా కేంద్రం వినిపించుకో లేదన్నారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకు దశాబ్దం గడిచి నా మోక్షం లేకపోవడం నయవం చన కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఇళ్లకు మంచినీళ్లిచ్చే రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దితే, దాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్ష న్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యాను తెరిపించి యువ తకు ఉపాధి కల్పించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రం వినిపించుకోక పోవడం ఆ ప్రాంత ప్రజలపట్ల బీజే పీకి ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శ నంగా నిలుస్తోందన్నారు. కేంద్రంలో పద కొండేళ్లుగా అధికారంలో ఉన్నా రాష్ట్రానికి దక్కిందేమీ లేదని, బీజే పీ నుంచి ఎనిమిది మంది ఎంపీ లను గెలిపించినా ఎనిమిది పైసలు పైసలు కూడా తీసుకురాలేని అస మర్థతను తెలంగాణ ప్రజలు గమ నిస్తున్నారన్నారు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి అప్పుల పై బురదజల్లి తప్పించుకోలేరని, బీజేపీ చేసిన తప్పులను తెలంగా ణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని కేటిఆర్ తేల్చిచెప్పారు.