–బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున
BRSV Nagarjuna : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : ప్రశ్నిస్తే కేటీఆర్ పై కేసులు పెడతారా అంటూ బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మండిపడ్డారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవ తరగతి పరిక్షల నేపథ్యంలో మొదటి రోజే నకిరేకల్ లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్నాపత్రం పరిక్ష మొదలైన పదినిమిషాల్లో లీకై, ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు వారిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుక కేటిఆర్ కు కొత్తేమి కాదని ప్రభుత్వని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలని లేదంటే, సీబిఐ కి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. దీనివెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉందనే అనుమానం, నిందితులు సోషల్ మీడియాలో వారి ఫోటోలు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉండటంతో అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయంలో అభంశుభం తెలియని బాలికను డిబార్ చేసి తన జీవితాన్ని ఆగం చేశారని వాపోయారు.తక్షణమే కేటిఆర్ పై కేసులను ఎత్తివేసి నష్టపోయిన బాలికకు పరిక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు నోముల క్రాంతి కుమార్, పాక రవి, మాచర్ల సుధీర్, విజయ్, వేముల సాయి, రమేష్, ఉదయ్, నవీన్, శంకర్, సైదులు, రాజు, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.