Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brutal murder: మహిళ దారుణ హత్య

–హత్య అనంతరం బాత్రూంలో దాచిన మృతదేహం
–హైదరాబాద్ ఉప్పల్ లో దారుణ దుర్ఘటన
–దుర్వాసన రావడంతో పోలీసుల కు చుట్టుపక్కల వాళ్ళ సమాచారం

ప్రజాదీవెన, ఉప్పల్: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ (Uppal Police Station)పరిధిలో పోలీసులు ఓ కేసును కేవలం గంటల వ్యవధిలో చేధించారు. స్థానిక న్యూ భరత్ నగర్ లో ఓ మహిళ హత్యకు (woman)గురి కాగా.. ఆ మర్డర్ కేసును 12 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టేశారు. మహిళ భర్తనే ఆమెను చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. వెంటనే అతణ్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఉప్పల్ న్యూ భరత్ నగర్ (Uppal New Bharat Nagar)లో ఐదు నెలలుగా ఓ హోటల్లో పనిచేస్తూ మధు స్మిత, ప్రదీప్ బోలా దంపతులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు ఉంటుండేవి. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం.. రీల్స్ చేయడం, ఫోన్ తో గంటలు తరబడి ఉండడంతో ఆమె భర్త ప్రదీప్ (prathap)బోలా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అర్ధరాత్రి చపాతి పీటతో తలపై కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయింది. తర్వాత చున్నితో ఆమె మెడకు బిగించి భర్త ప్రదీప్ హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూంలోని బస్తా సంచిలో ఉంచి తాళం వేసి ప్రదీప్ పరారైయ్యాడు. అలా పారిపోయిన భర్తను బేగంపేట ఏరియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ఉప్పల్ పోలీసులు రిమాండ్ కు(remand) తరలించారు.