Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

brutalmurders : మానవత్వం మంటకలిసిన వేళ, ఆస్తి కోసం ఐనోళ్ళ అంతుచూసి

మానవత్వం మంటకలిసిన వేళ, ఆస్తి కోసం ఐనోళ్ళ అంతుచూసి

brutalmurders: ప్రజా దీవెన, హైదరాబాద్: సభ్యసమాజం చెరబడుతోంది. మానవత్వం మంట కలుస్తోంది. కనికరం లేని మ నుషులు మానవ విలువ లను తిలోదకాలు ఇస్తున్నారు. ఆ ఖరికి ఐనోళ్ల అంతు చేసేoదుకు వ రకూ వెళ్తున్నారంటే సభ్య సమా జం తలదించుకునే పరిస్థుతులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి.

ఈ క్రమంలో అయినవారి కన్నా ఆస్తిపాస్తులే ప్రదానమన్నట్లు అవ సరమైతే ప్రాణాలు తీసేందుకు వెనుకాడండం లేదు. ఇలాంటి సం ఘటనలకు ఉతమిస్తూ అక్కడా ఇక్కడా రెండు వేర్వే రు ఘటనల్లో నిందితులు ఇలానే జరిగాయి. చుక్కపడకుండా క్షణం ఉండలేని ఓ పుత్రరత్నం ఆస్తి పంచివ్వాలని, లేదంటే చంపేస్తానని కొన్నాళ్లుగా తల్లిదండ్రులను బెదిరిస్తూ చిట్ట చివరకు అన్నంత పనీ చేశాడు. రాత్రి గదిలో నిద్రిస్తున్న కన్నతల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు.

మరో ఘటనలో ఐదు గుంటల భూమిని తన పేరు మీద రాయాలని కొన్నాళ్లుగా భర్త ను వేధిస్తున్న భార్య చివరికి అత డిని గొంతు పిసికి చంపేసింది. సం గారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ గ్రామానికి చెందిన నవారి మల్లారెడ్డి, రాధికా రెడ్డి (51) దంపతులకుఇద్దరు కు మారులు. ఈ కుటుంబానికి తెల్లా పూర్‌లో రూ.100 కోట్ల విలువైన రెండెకరాల భూమి ఉన్నట్లు సమా చారం. పెద్ద కొడుకు సందీప్‌రెడ్డి వివాహం గత ఏడాది నవంబరులో జరిపించారు. చిన్నకొడుకు కార్తీక్‌ రెడ్డి (26) మద్యానికి బానిసగా మారాడు.

ఆ మత్తులో తరచూ కుటుం బసభ్యులను వేధించేవాడు. తనకు ఆస్తి పంచి ఇవ్వాలని తల్లిదండ్రుల తో గొడవపడేవాడు. మద్యం మా న్పించడానికి కార్తీక్‌రెడ్డిని కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని డీ అడిక్షన్‌ కేంద్రంలో చేర్పించారు. అ క్కడి నుంచి తిరిగొచ్చాక కూడా కార్తీక్‌రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలే దు. మద్యం తాగడం, తల్లిదండ్రు లను వేధించడం మానలేదు. ఆది వారం రాత్రి కూడా తల్లిదండ్రులతో గొడవపడిన వారిని చంపుతానని బెదిరించాడు.

సోమవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్రిస్తుం డగా కత్తితో గదిలోకి ప్రవేశించి తల్లి రాధికపై కత్తితో దాడి చేశాడు. పొ ట్ట, వీపు సహా తొమ్మిది చోట్ల కత్తి తో పొడిచాడు. అడ్డుకోబోయిన తండ్రిపైనా దాడికి పాల్పడ్డాడు. మ ల్లారెడ్డి, రాధిక అరుపులకు మరో గదిలో నిద్రిస్తున్న సందీప్‌రెడ్డి రావ డంతో కార్తీక్‌ అక్కడి నుంచి పారి పోయా డు. తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబసభ్యులు హు టాహుటి న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ సోమవారం ఉదయం ఆమె మృతిచెందింది. తండ్రి మల్లారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.

ఘటన పై కేసు నమోదైంది. నిందితుడు పో లీసుల అదుపులో ఉ న్నాడు. మ హబూబ్‌నగర్‌ జిల్లా, హన్వాడ మండలంలోని ఇబ్రహీం బాద్‌ గ్రా మానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ (47) కు భార్య లక్ష్మి ఉంది. తర్వాత జయమ్మను అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జయమ్మను వదిలేసి మొదటి భార్య లక్ష్మి వద్దే ఉంటున్నాడు. శ్రీనివా స్‌గౌడ్‌కు ఐదు గుంటల భూమి ఉంది. ఈ భూమి విషయం లో భార్యా భర్తల మధ్య 15 రోజులుగా గొడవ జరుగుతోంది.

ఉన్న ఐదు గుంటల ను తన పేరుమీద రాయాలని శ్రీని వాస్‌ను లక్ష్మి సతాయిస్తోంది. ను వ్వు చేస్తే రైతుబీమా కింద నాకు రూ.5లక్షలు వస్తాయని తిడుతోం ది. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి లక్ష్మి, తన కుమారుడి సహకారం తో నిద్రిస్తున్న భర్తను గొంతు నులి మి చంపేసింది. హతుడి సోదరుడు తిరుమలేశ్‌ ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.