Buddhavanam srilanka : బుద్ధవనాన్ని సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు
--ఘన స్వాగతం పలికిన నల్లగొండ జిల్లా అధికారులు
బుద్ధవనాన్ని సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు
–ఘన స్వాగతం పలికిన నల్లగొండ జిల్లా అధికారులు
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, వార సత్వం, మీడియా (media) అంశా లపై 15 రోజుల శిక్షణలో భాగం గా శ్రీలంక (srilanka) దేశానికి చెందిన 30 మంది మీడి యా ప్రతి నిధుల బృందం శుక్రవారం నల్లగొండ జిల్లా బుద్ధవనం, నాగార్జు నసాగర్ ప్రాజె క్టు, నాగార్జునకొండలను సందర్శించింది.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (Department of Foreign Affairs) ఆధ్వర్యంలో శ్రీలంక మీడియా ప్రతినిధుల బృం దం గత నెల 24 నుండి ఈనెల 7వ వరకు హైద రాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభి వృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం మన దేశానికి వచ్చింది. 15 రోజుల శిక్షణ లో భాగంగా శ్రీలంక మీడియా బృం దం ముందుగా హైదరాబాద్, వరం గల్, జహీరాబాద్ తదితర ప్రాంతా లను సందర్శించింది.
శుక్రవారం నల్గొండ జిల్లాకు రాగా, నల్గొండ జిల్లా విజయ విహార్ వద్ద శ్రీలంక పాత్రికేయ బృందానికి మిర్యాలగూ డ ఆర్డిఓ శ్రీనివాస రావు, నల్గొండ జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటే శ్వర్లు పూల బొకేలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుద్ధవ నం నాగార్జున కొండ, నాగార్జునసాగర్ (nagarju na Sagar) ప్రాజెక్టు, నల్గొండ జిల్లా వివరాలను ఆర్డిఓ,ఏడీలు శ్రీలంక పాత్రికేయ బృందానికి వివరించారు.
బుద్ధవనం గైడ్ సత్యనారాయణ బుద్ధ వనం, నాగార్జున కొండ సంద ర్శన సందర్బంగా వాటి విశేషాలను, ప్రాముఖ్యతను పాత్రికేయులకు ( journalists ) వివరంగా తెలియజేశారు. నాగార్జునసాగర్ ప్రాజె క్టు అసిస్టెంట్ ఇంజినీర్ సత్యనారాయణ ప్రాజెక్టు వివరాలను తెలి యజేయగా, పెద్దవూర డిప్యూటీ తహసిల్దార్ శరత్, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి తది తరులు ఈ బృందం వెంట ఉన్నారు.
కాగా శ్రీలంక ప్రధానమంత్రి మీడియా, విదేశీ వ్యవహారాలు సలహా దారు సుగీస్వర పి. సేనధీర నేతృత్వంలో శ్రీలంక లోని వివిధ ప్రావె న్స్ లలో పౌర సంబంధాల శాఖలో పనిచేసే అధికారులు, పాత్రికేయు ల బృందం జిల్లాకు వచ్చారు.
డాక్టర్ మర్రిచెన్నారెడ్డి (marri chennareddy) మానవ వన రుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డా క్టర్ శశాంక్ గోయల్ ఈ 15 రోజు ల శిక్షణ కార్యక్రమాన్ని రూపొం దిం చడం జరిగింది. కోర్సు డైరె క్టర్ గా డాక్టర్ ఆర్. మాధవి వ్యవహరించగా, ఫ్యాకల్టీ డాక్టర్ కే. సురే ష్ కుమార్ శ్రీలంక బృందంతో ఉన్నారు.
Buddhavanam srilanka