Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Budget Meetings: అసెంబ్లీ సమావేశాలకు వేలాయే

–ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారం భానికి నిర్ణయం

Budget Meetings: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Assembly budget meetings) ప్రారంభానికి వేలయ్యింది. సమావే శాలకు సంబంధించి ముఖ్యమైన సంకేతాలు అందాయి. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు సమాచారo. అసెంబ్లీ సమావేశాల (Assembly meetings) నిర్వహణపై గురువా రం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gaddam Prasad Kumar, Council Chairman Gutta Sukhender Reddy)లు అసెంబ్లీలో సమీ క్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు రామచంద్రనాయక్, ఆది శ్రీనివాస్, సీఏస్ శాంతికుమారి, డీజీపీ జితేం దర్, ఇతర ఉన్నతాధికారులు హాజ రయ్యారు.అయితే అసెంబ్లీ సమావే శాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై మరింత స్పష్టమైన సమా చారం వెల్లడి కావాల్సి ఉంది. మరో వైపు ఈసమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ (budget) ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్‌ను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్న ట్లు ప్రభుత్వ వర్గాలు వెల్ల డిస్తున్నా యి.