పదవులు అశాశ్వతం, పట్టణ అభివృద్దే శాశ్వతం
–మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
Burrisrinivasreddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పదవు లు ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేయడం జరుగుతుందని నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొం డ పట్టణంలోని 47 వార్డు విద్యా నగర్ పార్కులో విద్యానగర్ అభి వృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మున్సి పల్ చైర్మన్, వైస్ చైర్మన్ గా పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అబ్బ గోని రమేష్ గౌడ్, కవిత దంపతులకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గా పట్టణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. మం త్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహకారంతో నల్గొండ పట్టణంలోని కోట్లా ది రూపాయలతో పలు వార్డులలో ఎన్నో అభివృద్ధి పనులు కొనసా గుతున్నాయని తెలిపారు. పదవి ఉన్నా లేకపోయినా పట్టణ అభివృ ద్ధి కోసం తన వంతు సహ కారం అందిస్తానని స్పష్టం చేశారు.
ము న్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లా డుతూ మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయడం జరిగిం దని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మ న్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గా తా ను ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో అభివృద్ధి కార్య క్రమా లను చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ సంతోషంగా తమ పదవి కాలాన్ని పూర్తి చేసు కోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, పలు వు రు కాంగ్రెస్ పార్టీ నాయ కులు, విద్యానగర్ కాలనీవాసులు, విద్యా నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డుకు చెందిన వివిధ కాలనీల ప్రజలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.