రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి
ప్రజా దీవెన/శామీర్ పేట: హైదరాబాద్ నగరంలో సమీపంలోని మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతిచెందాడు.
గజ్వేల్ ప్రజాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, చిన్న లారీని ఓవర్ టేక్ చేసిన వివాదంలో కండక్టర్ బస్సు దిగి రోడ్డుపై మాట్లాడుతుండగా వెనుక నుంచి కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ కండక్టర్ బాల నర్సింహ(47)ను ఢీకొని రోడ్డు కిందకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాల నర్సింహ అక్కడికక్కడే మృతిచెందాడు.చిన్న లారీ డ్రైవర్, బస్సు లోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు సిద్దిపేట జిల్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.