Busireddy Foundation:ప్రజా దీవెన, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో (Nagarjunasagar Pylon Colony) నివసించే నక్కా వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం మరణించగా సమాచారం తెలుసుకున్న బుసి రెడ్డి పాండు రంగారెడ్డి కుటుంబానికి ఆర్ధిక సాయం ప్రకటించారు. ఆ కుటుంబాని కి అండగా ఉంటామని చెప్పిన ఆయన మృతుని కూతురిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.బుసిరెడ్డి ఫౌండేషన్ (Busireddy Foundation) చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి (Busireddy Panduranga Reddy)తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ (Tirumalagiri Sagar)మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి,9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ,6వ వార్డు కౌన్సిలర్ విక్రమ్, సాగర్ రెడ్డి,గజ్జల శివానంద రెడ్డి,ఇస్రం లింగస్వామి, అనుముల కోటేష్, అబ్దుల్ కరీం,వంగాల భాస్కర్ రెడ్డి,చామల జయంత్ రెడ్డి, నితిన్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.