ప్రజా దీవెన, తిరుమలగిరి సాగర్: తిరుమలగిరి సాగర్ మండల కేంద్రానికి చెందిన పెదమాము సైదులు కుటుంబానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆర్థిక సహాయం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజ కవర్గం తిరుమలగిరి సాగర్ మం డల కేంద్రానికి చెందిన పెదమాము సైదులు, పెదమాము ప్రశాంత్ కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లిన సమయంలో జరిగిన షార్ట్ సర్క్యూ ట్ కారణంగా సామాగ్రితో పాటు ఇతర వస్తువులు అన్ని కాలి పోయాయి.
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధo కాగా ప్రమా దంలో సుమారుగా 2లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పెదమాము సైదులు, ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం లింగాల వరప్రసాద్ ద్వారా తెలుసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాం డురంగా రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి, తాజా మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాద వ్,మాజీ సొసైటీ కోపరేటివ్ నాగెం డ్ల కృష్ణారెడ్డి,నితిన్, సత్యనారా యణ, గజ్జల నాగార్జున రెడ్డి మరియు తిరుమలగిరి సాగర్ మండల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.