Butchala Nagaraja Goud : ప్రజా దీవెన, నల్గొండరూరల్: కొత్తపల్లి గ్రామంలో ప్రజా పాలన పేరుతో నిర్వహిస్తున్న గ్రామ సభలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నారని బిజెపి నల్గొండ మండల ఉపాధ్యక్షులు బుచ్చాల నాగరాజుగౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు .
నాగరాజుగౌడ్ మాట్లాడుతూ ఆరుగ్యారంటీలో అమలు చేయడం లో విఫలం అయ్యి స్థానిక సంస్థల ఎన్నికల ముందు గ్రామసభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలు మభ్య పెట్టడానికి అర్హులైన వారిని గుర్తించకుండా గతంలో దరఖాస్తు చేసిన వారందరు పేర్లు చదువుతూ ఇదే ఫైనల్ లిస్టు అని మరొకరు మళ్ళీ దరఖాస్తు చేయాలని మాట్లాడుతున్నారని ప్రజల్ని తికమక పెడుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిజెపి నల్గొండ మండల ఉపాధ్యక్షులు బుచ్చాల నాగరాజు గౌడ్ అధికారులను ప్రశ్నించారు