Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Buttermilk Distribution : ప్రభుత్వ హాస్పిటల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి

Buttermilk Distribution : ప్రజా దీవేన, కోదాడ: వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యం లో సోమవారం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు,గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు 200 మందికి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ దశరధ్ నాయక్, వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు లు పాల్గొని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దాత కందిబండ నాగేశ్వరరావు – విజయలక్ష్మి(మదర్ డైరీ డిస్ట్రిబ్యూటర్)సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు అందజేయడం అభినందనీయమని తెలిపారు.

వాసవి క్లబ్ అందిస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అలాగే మున్ముందు అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు,సెక్రటరీ పత్తి నరేందర్,కోశాధికారి వెంపటి ప్రసాద్, ఐపిసి పబ్బా గీత దేవి, డి పి సి ఇమ్మడి సతీష్ బాబు, ఆర్ సి బెలిదే భరత్, ఆర్ ఇ సి కొండూరు మాధవి, ఆర్ఎస్ రీజియన్ 9 బండారు శ్రీనివాసరావు,డాక్టర్ శ్రీరంగం లక్ష్మణ్, హాస్పిటల్ నర్సులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.