C.I. T. Ramulu : ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ పరిధిలోని స్థానిక కె.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కోడాడ పట్టణ షీటీం పోలీసు సిబ్బంది విద్యార్థులకు వర్తమాన సమాజంలో, సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.హదస రాణి అధ్యక్షతన జరిగినసమావేశంలో కోదాడ పట్టణ సి.ఐ టి.రాములు మాట్లాడుతూ మహిళలకు రక్షణ అవసరమని షీ టీమ్స్ సహకారం మహిళలకు ఉంటుందని.
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కోదాడ పట్టణ ఎస్.ఐ లింగయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని చదువుకున్న కళాశాలకు మంచిపేరు తేవాలన్నారు .ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం పాటల ద్వారా విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి షీటీమ్ ఎ.ఎస్. ఐ కృష్ణమూర్తి, మహిళ పోలీసు సాయిజ్యోతి ప్రసంగించారు. అదేవిధంగా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.చందా అప్పారావు, ఛైల్డ్ ప్రోటక్షన్ ఆఫీసర్ మీరా మాట్లాడారు.ఈ కార్య క్రమంలో మహిళా సాధికారత విభాగం కన్వీనర్ శ్రీలత, ఎన్ .ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డా. ఎన్. నిర్మల కుమారి, వెంకటేశ్వర రెడ్డి మరియు అధ్యాపకులు నాగిరెడ్డి, సైదులు, రఫీ, రాజు, సైదమ్మ ,సుమలత, శ్రీలక్ష్మి ,విజాకర్, విద్యార్థులు పాల్గోన్నారు.