Cabinet Alert : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ మంత్రివర్గ విస్తరణ పై చర్చో పచర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తె లుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డితో పాటు మం త్రులు భట్టి విక్రమార్క, ఉత్తంకు మార్ రెడ్డి తదితరులు హస్తినలో జరిపిన చర్చల నేపధ్యంలో కొత్తగా నలుగురు కొత్త మంత్రులకు రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలో అవకా శం కల్పించనుందనీ , అందుకు సం బంధించి ఇక ఈ కొత్త మంత్రులు ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం చేయ నున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ నలుగురికే అవకా శం… అధిష్టానం నుంచి అనుమ తి అనంతరం ఇప్పటికిప్పుడు ఆ నలుగురికే అవకాశం ఇవ్వాలని సీ ఎం నిర్ణయానికి వచ్చినట్లు సమా చారం. ఇక నలుగురు మంత్రుల్లో ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీ సామాజి క వర్గాలకు చెందిన వారికి మంత్రివ ర్గంలో చోటు దక్కవచ్చని అంటు న్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి మం త్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఎస్సీలో చె న్నూర్ ఎమ్మె ల్యే వివేక్ వెంకట స్వామికి బీసీ సామాజిక వర్గంలో ఆది శ్రీనివాస్, శ్రీ హరి ముదిరాజ్‌ల కు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఒక వేళ మరో స్థానం భర్తీ చేయాలను కుంటే మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మె ల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. అప్పుడు ఆది శ్రీ నివాస్, వా కిటి శ్రీహరిలో ఒకరికే అవకాశం ద క్కవచ్చని భవిష్యత్ లో మరో ఇద్ద రితో మంత్రి వర్గాన్ని ఫుల్ ఫిల్ చే యాలని సీఎం నిర్ణయానికి వచ్చి నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తు న్నాయి.