–తెలంగాణలో ఎన్నికల బిజీ ముగి సినందున కసరత్తు ప్రారంభం
–ఖాళీల్లోని నాలుగు స్థానాల భర్తీ కి మాత్రమే ప్రస్తుత మంతనాలు
–తెలంగాణలో 18 మంత్రి పదవుల గాను 11 మందితో కొనసాగుతుం డగా మారో ఏడుగురికి అవకాశం
–సామాజిక, రాజకీయ సమీకరణా లతో కొత్తవారికి మంత్రి పదవులు దక్కనున్నాయని ప్రచారం
–కొత్త మంత్రుల ఎంపిక కసరత్తుపై ఇప్పటికే ఢిల్లీ పెద్దల అనుమతి
Cabinet expansion:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ (telangana) మంత్రి మండలి (Cabinet expansion) ఖాళీల భర్తీకి కస రత్తు ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ము గిసిన నేపథ్యంలో మంత్రిమండలి (Cabinet expansion) ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) ఇప్పటికే కసర త్తు ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు మాసాలకే పార్లమెంట్ ఎన్నికలు రావడం చూస్తుండగానే ముగియడం జరిగిపోవడంతో ప్రభు త్వం పాలనపై దృష్టి కేంద్రీకరించిం ది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణ యం తీసుకున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభు త్వం (congress) కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టా రు.
తెలంగాణ కేబినెట్‌లో (Telangana Cabinet) 18 మం త్రి పదవుల వరకు అవకాశం ఉండ గా ప్రస్తుతానికి సీఎం తో పాటు 11 మంది మంత్రులు మాత్రమే బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే ప్రస్తుతానికి మంత్రి పద వుల ఎంపిక మాత్రం మిగిలిన ఆరు పదవుల్లో నలుగురికి మాత్రమే భర్తీ చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెలాఖరు లేదంటే జులై మొదటి వారంలో విస్త రణకు సంబంధించిన ప్రక్రియ చేప ట్టే అవకాశం ఉంది.ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు మునిసిపల్ అడ్మిని స్ట్రేషన్ &అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విద్య వంటి కీలక శాఖలు ఉన్నాయి. ఈ నేప థ్యంలో ఆయా శాఖలను కొత్త మం త్రులకు అప్పగించేందుకు కసర్తతు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చిం చగా విస్తరణకు అదిష్ఠానం ఓకే చెప్పిందని గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాలు వె. తొలి దశలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత ఇద్దరిని తీసుకోనున్నట్లు సమాచారం. అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది ఉన్నా.. ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కుల, సామాజిక, రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరికీ ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది.
కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయంలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించినా వివిధ సామాజిక సమీకరణాల్లో భాగంగా పదవి దక్కలేదు. ఈ ధపా ఆయన్ను మంత్రివర్గంలోకి (Cabinet expansion) తీసుకోనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పేరు తెరపైకి వస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో విస్తరణలోఆయనకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), గడ్డం వివేక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఈ ఇద్దరు నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మంత్రి పదవి హామీతోనే పార్టీలో చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాగా, రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతుండగా.. వివేక్ కుమార్ వంశీ ఎంపీగా, మరో సోదురుడు వినోద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికికి మంత్రి యోగం దక్కనుందో వేచి చూడాలి.ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక మైనార్టీ కోటాలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓ మైనార్టీ నాయకుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. మెుత్తంగా ప్రస్తుతం నలుగురిని మంత్రి వర్గంలోకి తీసుకొని మరో ఇద్దరికి తర్వాత ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ (revanth) యోచిస్తున్నట్లు తెలుస్తోంది.