–తెలంగాణ శాసనసభ వర్షాకాల
సమావేశాల ఖరారుకు నిర్ణయo
— రుణ మాఫీ విధివిధానాలపై క్యాబినెట్లో చర్చ
Cabinet meeting: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ (TELANGANA) రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 21న తేదీన నిర్వహించేందుకు నిర్ణయం తీసు కున్నట్టు సమాచారం. ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి (REVANTH REDDY) అధ్యక్ష తన మంత్రివర్గ సమావేశాన్ని సచి వాలయంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో (Cabinet meeting) ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 లోపు అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు.
రుణ మాఫీ పథకం (Loan waiver scheme) అమలు కు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అవసరమైన నిధులను సేకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, విధి విధా నాలను ఈ సమావేశంలోనే ఖరారు చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పథకానికి ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేట్‌ను నిర్ణయిం చాలి, ఇంకా ఎలాంటి నిబంధనలు విధించాలన్నదానిపై కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో (Cabinet meeting) కూలంకషంగా చర్చిం చి, మంత్రుల అభిప్రాయాలను కూ డా క్రోడికరించి తుది నిర్ణయం తీసు కునే అవకాశం ఉంది.అసెంబ్లీ వర్షా కాల సమావేశాలను నిర్వహిం చా ల్సి ఉన్నందున ప్రారంభ తేదీని ఖరారు చేయనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో జరిగా యి. వీటితో పాటు నీటిపారుదల, విద్యుత్ శాఖలపై (
Irrigation and Power Departments) ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కమిషన్ల విచారణలు కూడా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు.