బిగ్ బ్రేకింగ్, కాల్వలోకి కారు దూసుకెళ్లి ముగ్గురు మృత్యువాత
Carroadaccident : ప్రజా దీవెన, వరంగల్: ఎస్సారెస్పీ కాల్వ లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమారుడు మృతి చెంద గా తండ్రి, కుమార్తె గల్లంత య్యారు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లి ని స్థానికులు కాపాడారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరా జుbపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన తండ్రి, కు మా ర్తె కోసం గాలింపు కొనసాగుతోంది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సో మారపు ప్రవీణ్ తన భార్య కృ ష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమా రుడు ఆర్య వర్ధన్ సాయితో కలి ర్సి హనుమకొండ నుంచి స్వగ్రా మా నికి కారులో బయలుదేరారు. ఈక్రమంలో మార్గమధ్యలో ఆయనకు గుండె నొప్పి వచ్చింది.దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేం దుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడింది.
స్థానికుల సాయంతో కృష్ణవేణి బయ టపడింది. కుమారుడు మృతి చెందగా కారుతో సహా ప్రవీణ్, చైత్ర సాయి నీటి ప్రవాహంలో కొట్టు కుపోయారు. నీటిని అదుపులోకి తీసు కువచ్చి కారును, ప్రవీణ్ ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.