Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CAT : మియ్యాం మియ్యాం పిల్లి పెట్టిoది లొల్లి, అది కాస్తా పెద్ద లొల్లి

–పిల్లినే కదా అని సిల్లీగా తీసుకుం టే బాస్ దగ్గరికి వెళ్ళింది లొల్లి

CAT : ప్రజా దీవెన నల్లగొండ:మియ్యాం మియ్యాం పిల్లి పెట్టిoది లొల్లి.. అది కాస్తా పెద్ద లొల్లిగా మారింది. ఈ లొల్లి కాస్తా నల్లగొండ జిల్లా పోలీ సులకు ఓ వింత కేసు మాదిరిగా నెత్తి నొప్పిగా మారింది.తన పిల్లి మిస్సయ్యిందంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.సీన్ కట్ చేస్తే తన ఇంటి పక్కన వారే కిడ్నాప్ చేశారంటూ పిటీషన్ లో పేర్కొంది. ఈ పంచాయితీ కాస్తా జిల్లా పోలీస్ బాస్ దగ్గరకు వెళ్లిo ది.పిల్లి నాదంటే నాదనే వాదనలు వినిపిస్తున్నాయి రెండు కుటుంబా లు.దాంతో పిల్లి ఎవరిదనే తేల్చే పనిలో పడ్డారు నల్లగొండ ఖాకీలు.
ఈ పిల్లి లొల్లి కదాకమిషన్ ఇలా.

నల్గొండ పట్టణంలోని రేహమత్ నగర్ కు చెందిన పుష్పలత నెల రోజుల పిల్లిని తెచ్చుకుని పెంచు కుంటుంది.దానికి “పఫి” అనే పేరు పెట్టింది.మూడేళ్లుగా కంటికి రెప్ప లా కాపడుకుంటుంది. గతేడాది జూన్ లో పిల్లి మిస్సయ్యింది. దాం తో టూటౌన్ పీఎస్ లో మిస్సింగ్ కేసు పెట్టింది పుష్పలత.సీన్ కట్ చేస్తే ఆ పిల్లి అదే గల్లీలో ప్రత్యక్ష మైంది. ఆశ్రఫ్ అనే వ్యక్తి తన పిల్లిని గుర్తు పట్టకుండా రంగు వేశారని పుష్పలత ఆరోపిస్తుంది.ఆ విష యాన్ని పోలీసులకు వివరించిం ది.లేదు లేదు ఈ పిల్లి మాదేనని అశ్రఫ్ కుటుంబం అంటుంది. ఓ వ్యక్తి దగ్గర 3,500 రూపాయలకు కొనుక్కున్నాని చెబుతోంది.ఇక పిల్లి గొడవ పోలీసులు సిల్లీగా తీసుకోవ డం తో పంచాయితీ కాస్తా ఎస్పీ దగ్గరికి వెళ్ళింది.దాంతో బాస్ ఆదేశాల మేరకు పిల్లి హెయిర్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

 

ప్రస్తుతం ఘటనపై విచారణ వేగవంతంగానే కొనసాగు తోంది. నిజంగా పుష్పలత వాదిస్తు న్నట్టు పిల్లికి రంగు పూసారా అశ్రఫ్ చెబుతున్నట్టు అది పుట్టుకతోఉన్న కలరేనా అన్నదే ల్యాబ్ రిపోర్ట్ లో తేలనుంది.ప్రస్తుతం పిల్లి (పఫి) అ శ్రఫ్ పర్యవేక్షణలోనే ఉంది.ల్యాబ్ రిజల్ట్ లో విజయం తనదే అంటుం ది పుష్పలత. అదీ చూద్దాం అస్స లు తగ్గేదేలే అంటుంది అశ్రఫ్ కు టుంబం. చూడాలి నెగ్గేదెవరో తగ్గే దెవరో మొత్తానికి పిల్లి లొల్లి మా త్రం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ప్రజలు ప్రధానంగా నెటిజెన్లు మాత్రం ఈ పిల్లిపితలాటకం కు ఇంత సీన్ అవసరమా అంటూ ఓవైపు నవ్వుకుంటూనే అవసరమా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.