Central Pollution Control Board : అత్యంత కాలుష్య పరిశ్రమల్లో ఆ సిమెంట్ పరిశ్రమ, సెంట్రల్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డ్
Central Pollution Control Board : ప్రజా దీవెన, వాడపల్లి: అదాని సి మెంట్ పరిశ్రమ కాలుష్యం సూర్యా పేట జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. సిమెంట్ పరిశ్రమ యొ క్క కాలుష్య కారకాలు గాలి,నీరు మరియు భూమిపై ప్రతికూల ప్రభా వాలను ఉత్పత్తి చేస్తాయి.సిమెంట్ పరిశ్రమ అనేక పర్యావరణ కాలు ష్య సమస్యలకు కారణమవుతోంది
భారతదేశంలోని సెంట్రల్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డ్ జాబితా చేసిన 17 అత్యంత కాలుష్య పరిశ్రమల లో సిమెంట్ పరిశ్రమ ఒకటి.
సిమెం ట్ ప్లాంట్ల చుట్టూ ఉన్న ప్రాంతాల లో జరిగిన జియో ఎన్విరాన్ మెం టల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రకారం ఓవర్‌బర్డెన్ మెటీరియల్ డంపింగ్, దుమ్ము కాలుష్యం మరియు సు న్నపురాయి తవ్వకం మరియు సిమెంట్ తయారీ యొక్క వివిధ దశలు గాలి, నీరు, నేల, భూమి మరియు వృక్షసంపదపై ప్రమాదకర పర్యావరణ మానసిక ప్రభావాలను కలిగిస్తాయి.నల్లగొండ జిల్లా వాడప ల్లి మండలం గణేష్ పహాడ్ గ్రామం లోని అదాని సిమెంట్ ఫ్యాక్టరీ నుం డి విడుదయ్యే కాలుష్యం సూర్యా పేట జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది.
ఈ ఫ్యాక్టరీ నుండి విడు దలయ్యే విషపూరిత పొగ, బూడి ద, దుమ్ము తదితర వ్యర్థాలతో ఈ ప్రాంత ప్రజలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్యపహాడ్, మహంకాళిగూడెం, రావిపాడు, జాన్ పహాడ్ గ్రామం మరియు దర్గా పరిసర ప్రాంత ప్రజలకు శాపంలా మారిందని వాపోతున్నారు. పరి శ్రమ నుండి వచ్చే కాలుష్యంతో పాటు భారీ వాహనాల రాకపోకల వల్ల ఏర్పడే సిమెంటు దుమ్ముతో పంట పొలాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
పెన్నా సిమెంట్ ఇండస్ట్రి యల్ నల్గొండ జిల్లా కింద ఉందని పక్కనే ఉన్న సూర్యపేట జిల్లా కింద ఉన్న గ్రామాలకు మాత్రం పెన్నా సి మెంట్ పరిశ్రమ గ్రామాల డెవల ప్మెంట్ నిధులు కేటాయించకపో వడంతో ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం దుమ్ము ధూళితో తమ ప్రాంతాలు నష్టపోతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత కొంత కాలంగా చీమ్ని నుండి వెలువడే పొగతో ఆరోగ్య సమస్యలు వస్తు న్నాయన్నారు. తాజాగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ పరిశ్రమను అదాని గ్రూప్ అను బం ధ సంస్థ కొనుగోలు చేసింది.
ఇప్ప టికైనా పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పరిసర గ్రామాలైన సూర్యాపేట జిల్లా గ్రామాలకు విలేజ్ డెవల ప్మెంట్ నిధులు కేటాయించి పరి శ్రమల ద్వారా సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. గత కొంతకాలంగా వెలువడే పొగపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించి చర్య లు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు.