Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Coal Mine Closures : కేంద్రం కీలక నిర్ణయం, బొగ్గు గనుల మూసివేతలో శాస్త్రీయత అమలు

Coal Mine Closures : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వా త ఇప్పటివరకు ఎన్నో ప్రాంతాల్లో బొగ్గు గనులు వెలికి తీయడం జరి గిందని, కానీ గనులు పూర్తయ్యాక వాటిని అలాగే వదిలేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ప్ర స్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 143 గ నులను శాస్త్రీయంగా మూసివేసేం దుకు కేంద్రం ప్రణాళిక రూపొందిం చిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే 10 గనుల్లో పని ప్రారంభిం చి, ఏడెనిమిది గనులను మూసివే శామని మిగతా గనులను కూడా ప ర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచు కుని మూసివేస్తామని , వాటిని స మాజానికి ఉపయోగపడేలా వృక్ష సంపద కలిగిన ప్రాంతాలుగా మా ర్చుతామని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతి వనంలో బుధవారం కేంద్ర బొగ్గు, గ నుల శాఖకు సంబంధించిన కన్సల్టే టివ్ కమిటీ సమావేశం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశo జరిగిం ది. మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్‌ప్లోరే షన్ వంటి కీలక అంశాలపై విస్తృ తంగా చర్చ జరిగింది.ఈ సందర్భం గా గనుల మూసివేత (మైన్ క్లోజర్) సమయంలో తీసుకోవాల్సిన చర్య లపై సభ్యులు పలు సూచనలు చే శారు. భూములు ఇచ్చిన ప్రజలకు మళ్లీ ఉపాధి క ల్పించాల్సిన అవస రాన్ని నేతలు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి, ప్రజలకు మ ళ్లీ ఉపాధి అవకాశాలు కల్పించే ది శగా కేంద్రం ముందడుగు వేస్తోందని తెలిపారు. మైనింగ్ పూర్తైన తర్వా త భూమిని శాస్త్రీయంగా మూసివే సి, మళ్లీ పర్యావరణానికి అనుకూ లంగా మారుస్తామని స్పష్టం చేశా రు.ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షే మం పై కూడా కేంద్ర మంత్రి కీలక ప్ర కటన చేశారు. మైనింగ్ రంగ ఉద్యో గుల కోసం ఇప్పటికే ఉన్న బీమా పాలసీ తో పాటు, అదనంగా ఒక్కో ఉద్యో గికి ₹1 కోటి విలువైన బీమా కూడా అమలు చేస్తున్నట్టు వెల్లడిం చారు. ప్రమాద నివారణకు అన్ని ర కాల జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని చెప్పారు.షాద్​ నగర్​ లో ఉన్న హార్ట్​ ఫుల్ నెస్ సంస్థ వృక్షసంప దను పెంచేదిశగా చేపడుతున్న చ ర్యల స్ఫూర్తితో మైన్స్​ క్లోజ్​ చేసిన తర్వాత సమాజానికి ఉపయోగ పడేలా వృక్ష సంపద పెంచుతామ ని , ఇందుకోసం హార్ట్​ ఫుల్​ నెస్ సం స్థతో ఎంఓయూ కూడా కుదుర్చు కున్నామన్నారు.

సమావేశం అనంతరం హార్ట్ ఫుల్‌ నెస్ సెంటర్, కన్హా శాంతివనంతో కోలిండియా, సింగరేణి సంస్థలు అనుబంధ ఒప్పందాలు చేసుకు న్నాయి. సింగరేణి సంస్థ రామగుం డం వద్ద గ్రీన్ వాల్ నిర్మాణానికి ఓ ఒప్పందానికి సంతకం చేయగా, కో లిండియా సంస్థ దేశవ్యాప్తంగా బొ గ్గు గని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపదను అభివృద్ధి చేసేందుకు ఒ క ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ “హార్ట్ ఫు ల్‌నెస్ సంస్థ చేపడుతున్న వృక్ష సం పద పనుల స్ఫూర్తితో మేము కూ డా మైనింగ్ పూర్తి అయిన ప్రాంతా లను పచ్చదనంతో మలచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందుకోసం హార్ట్ ఫుల్‌నెస్ సంస్థతో మేము ఎంఓయూ కూడా కుదుర్చు కున్నామని తెలిపారు.ఈ సమావే శం ద్వారా కేంద్రం బొగ్గు, గనుల రం గాన్ని పరిపాలనపరంగా ముందుకు తీసుకెళ్లడమే కాదు, ప్రజల జీవనో పాధి, పర్యావరణ పరి రక్షణ మధ్య సమతౌల్యం కల్పించేందుకు తీసు కుంటున్న చర్యలు స్పష్ట మయ్యా యి.

ఈ సమావేశంలో బొగ్గు, గనుల శా ఖ సహాయమంత్రి సతీష్ చంద్ర దూ బే, కమిటీకి చెందిన ఎంపీలు, గను ల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారా వు, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసా ద్, ఇతర అధికారులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సీఎండీలు పాల్గొన్నారు.