బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి
Chada Kishan Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: నిరుపేదలను (poor people) ఆదుకునేందుకు అందిస్తున్న సీఎం సహాయనిధిని సధ్వినియోగం చేసుకోవాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి (Chada Kishan Reddy)అన్నారు. మంగళవారం శాలిగౌరారంలోని ఆయన స్వగృ హంలో అరుగురికి సీఎం సహాయనిది(Helped by CM) నుంచి మంజూరైన రూ. 2 .18 లక్షల చెక్కులను వడ్ల కొండ శంకర్, వడ్ల కొండ యశోద, సత్తనపల్లి నాగయ్య, ధీకొండ రాకేష్, ఉమ్మల్ రెడ్డి దేవిరెడ్డి, భూపతి యాదమ్మ లకు అందజేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ తిరుమలరాయిని గూడెం అధ్యక్షులు కర్రె సైదులు, మాజీ ఎంపీటీసీ వడ్లకొండ బిక్షం, వడ్లకొండ వెంకన్న, కొండ నరేష్,కూరం వెంకన్న, వడ్లకొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.