–ప్రత్యేక పూజలు పాల్గొన్న చాడ కిషన్ రెడ్డి దంపతులు
Chada Kishan Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు (Saligauram project) సమీపం లోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం ఆవరణలో గత సంవ త్సరం ప్రతిష్టించిన ఆంజనేయ స్వామి విగ్రహానికి వార్షికోత్సవ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల తో నిర్వహించిన యజ్ఞం, హోమం, అభిషేకాలు (Yajna, Homam, Abhishekal_ప్రత్యేక పూజల్లో విగ్రహ దాత బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి (Chada Kishan Reddy)-ఇందిర దంపతులు, కుమారుడు చాడ చరిత్ రెడ్డి,కుంటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు శేషం రత్నమాచార్యులు, జగన్ మోహనా చార్యులు, రామచంద్రా చార్యులు, రఘునందన చార్యులు, మాజీ ఎంపీటీసీ వడ్లకొండ బిక్షం గౌడ్, నాయకులు కూరం వెంకన్న, వాడపల్లి జగన్ భక్తులు పాల్గొన్నారు.