Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chain snatching: చైన్ స్నాచింగ్ లు చేస్తున్న వ్యక్తి అరెస్టు

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన దొంగ

Chain snatching: ప్రజాదీవెన, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో ఒకవైపు వరస దొంగతనాలు.. ఇంకోవైపు చైన్ స్నాచింగ్‌లు (Chain snatching) చేసిన అంతర్ జిల్లా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి రూ.14.63 లక్షల విలువైన 20.9 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెలివైన దొంగ తాను దొంగిలించిన బంగారు ఆభరణాలను గోల్డ్ లోన్ (Gold Loan)సంస్థల్లో తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు జమా చేసుకోవడం అతనికి ఉన్నా ఓ అలవాటు.. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంగోత్ విక్రమ్ డ్రిల్లింగ్ మిషన్ టెక్నీషియన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు.

డబ్బులు ఎలా సంపాదించాలో యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ సీన్‌లను చాలాసార్లు చూసి… తను కూడా అలాగే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఖమ్మం, మహబూబాబాద్ (Khammam, Mahbubabad)ప్రాంతాల్లో ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయేవాడు.. అంతేకాదు తాళంవేసి ఉన్న ఇళ్లలో చేసిన కొన్ని చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలు కూడా రికార్డు అయ్యాయి. మొత్తం 11 చోరీలు చేసినట్లు మహబూబాబాద్ SP సుదీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాలలో కొన్ని గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టాడు. మిగిలిన కొన్ని అమ్మేందుకు మహబూబాబాద్ పట్టణానికి వస్తుండగా పోలీసులు అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు. ఈ డిఫరెంట్ దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందికి (polcie staff) ఎస్పీ రివార్డులను అందించి, అభినందించారు.