Chain snatching : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా కేంద్రం లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయంకు కూత వేటు దూ రంలో కొందరు దుండగులు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు.
కేటీఆర్ రైతు ధర్నా కు వెళుతున్న కార్యకర్తల ముసుగులో దొంగల ముఠా చేతివాటం ప్రదర్శించింది.
రోడ్డు పక్కన నిలబడి ఉన్న అరు గురి మెడలో బంగారు గొలుసు లు,పలువురి సెల్ ఫోన్ లు లాక్కొ ని పలాయనం చిత్తగించారు. నల్గొండ టు టౌన్ పరిధిలోని ఎన్ జి కళాశాల, క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఈ వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా టు టౌన్ పోలీసుల అదుపులో ఒక నింది తుడు ఉండగా పారిపోయిన దొం గల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే బాధితులు టు టౌన్ పోలీస్ స్టేషన్ కు క్యూ కడు తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.