Chairman Dr. Samudral Upender :ప్రజాదీవెన,నల్గొండ టౌన్
మార్చ్ 19 ,20 వ తేదీలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్గొండలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ను
విజయవంతం చెయ్యాలని
ప్రిన్సిపాల్, వికసిత్ భారత్ చైర్మన్ డా. సముద్రాల ఉపేందర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలను జిల్లా,రాష్ట్ర స్థాయి లో నిర్వహించి రాష్ట్ర అసెంబ్లీ లో దేశ పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం యువకులకు కల్పించడానికి పాల్గొనుటకు రిజిస్ట్రేషన్ చివరి తేది మార్చ్ 16 వరకు గడువు పెంచారని , 18 నుంచి 25 సంవత్సరాల యువకులు అర్హులు అని తెలియజేశారు. జిల్లా స్థాయి ఎంపికలు మార్చ్ 19,20వ తేదీలలో నోడల్ కేంద్రమైన నాగార్జున ప్రభుత్వ కళాశాల(A) నల్గొండలో జరుగుతాయని తెలిపారు.
నల్గొండ,యాదాద్రి మరియు నాగర్ కర్నూల్ జిల్లాలకు నోడల్ కళాశాల గా నాగార్జున కళాశాలను ఎంపిక చేసారు.ఈ మూడు జిల్లాలనుంచి మై భారత్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని “వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ” అనే అంశంపై ఒక్క నిమిషం వీడియో తీసి పంపాలి.జిల్లా స్థాయిలో యూత్ పార్ల మెంట్ ను నిర్వహించే అవకాశం నాగార్జున ప్రభుత్వ కళాశాలకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.వీడియోలు ఆఫ్ లోడ్ చేసిన వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 150 మందిని మూడు జిల్లాల నుంచి ఎంపిక చేస్తారు.జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్దులను రాష్ట్ర స్థాయికి 10మంది విద్యార్దులను పంపుతారు అని అన్నారు.