Chaitra Foundation Ramakrishna Goud : ప్రజా దీవెన శాలిగౌరారం : శాలిగౌరారం లోనిఎస్ సి కాలనీ లో పేద కుటుంబానికి చెందిన యువకుడు ఈర్ల సైదులు (35) ఇటీవల గుండెపోటు తో మరణించాడు. ఇతనికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. సైదులు అకాల మరణం తెలుసుకున్న చైత్ర ఫౌండేషన్ ఛైర్మెన్ యంగలి రామకృష్ణ గౌడ్ సైదులు కుటుంబాన్ని పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, అధ్యక్షులు డెంకల సత్యనారాయణ,శాలిగౌరారం మాజీ ఎం పి టి సి జోగు సైదమ్మ-శ్రీనివాసులు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధక్షులు వడ్లకొండ పరమేష్, జిల్లా నాయకులు చింత ధనుంజయ, ఓగోటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.