–సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చలకాని మల్లయ్య
Chalakani Mallaiah: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండల కేంద్రంలో బాలుర బిసి గురుకుల పాఠశాల (Boys BC Gurukula School)ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చలకాని మల్లయ్య (Chalakani Mallaiah) కోరారు. ఆదివారం అయన శాలిగౌరారం (Shaligouraram) లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ మండలం లో 24 గ్రామాలు,12 ఆవాస గ్రామాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు స్థానికంగా గురుకుల పాఠశాల లేకపోవడం తో సుదూర ప్రాంతాలకు ఎంతో వ్యయ ప్రయసాలకు వెళ్లి గురుకుల విద్యను అభ్యశిస్తున్నారన్నారు.
నియోజకవర్గం లోనే శాలిగౌరారం పెద్ద మండలమని ప్రతి గ్రామం నుంచి కొంతమంది బ్రతుకు దెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్తుండం వల్ల వారి పిల్లలు విద్యకు దూరం అవుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి లు వెంటనే స్పందించి శాలిగౌరారం లో బాలుర బీసీ గురుకుల పాఠశాలను వెంటనే మంజూరి చేయాలని మల్లయ్య కోరారు.