Chamakuri Venkanna Goud : ప్రజా దీవెన, నల్గొండ రూరల్: నల్గొండ మండల పరిధిలోని రాములబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు చామకూరి వెంకన్న గౌడ్ (51) రోజువారీ వృత్తిలో భాగంగా గురువారం ఉదయం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కగా.. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు.
వెంకన్న మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
మృతుడి భార్య ధనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు యస్ఐ డి. సైదా బాబు తెలిపారు..