గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి చందర్ రావు.
Chander Rao: ప్రజా దీవెన,కోదాడ:గ్రంథాలయాలు సామాజిక చైతన్య వేదికలని వాటిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు (Chander Rao) అన్నారు.జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా వంగవీటి రామారావు (Vangaveeti Rama Rao)నియామకమైన సందర్భంగా శనివారం కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామారావు ఎంతో కాలంగా నిబద్ధతతో పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీ బలోపేతానికి విశిష్ట సేవలందించారని వారి సేవలకు తగిన గుర్తింపుగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ పదవి రావడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.
అందరి సహకారంతో గ్రంథాలయాలను (Libraries) అభివృద్ధి చేసి కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికితన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, వేనెపల్లి శ్రీనివాసరావు,బొల్లు రాంబాబు, కోదాడ మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్యబాబు, రఘువర ప్రసాద్, గడ్డ నరసయ్య, విద్యాసాగర్, భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు.