ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య పట్టణ అభివృద్ధికి చేసినసేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం సుబ్బరామయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న సుబ్బరామయ్య విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు.
నేటి నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు. వారి ఆశయాల సాధన కొరకుప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు,పాండురంగారావు,మాజీసర్పంచ్ ఎర్నేనిబాబు,కుటుంబ సభ్యులు వరప్రసాద్, నరసింహారావు, శివరామయ్య,తొండాపూ సతీష్, బాగ్దాద్,డేగ శ్రీధర్, రాయపూడి వెంకటనారాయణ, ఉప్పుగండ్ల శ్రీను,చంద్రశేఖర్,పతంగి శ్రీను,పాలూరి సత్యనారాయణ, కేశవులు,బషీర్,జానకి రామయ్య, చింతలపాటి శ్రీనివాసరావు,హబీబ్,సుబ్బారావు, సైదా నాయక్,ఆదమ్,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు..