–భవిష్యత్ అవసరాలకు తగినట్లు విస్తరణ
— అవసరం మేర నూతన రోడ్లు నిర్మించాలి
— హెచ్ఆర్‌డీసీఎల్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లిం క్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూ చించా రు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహ దారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించా రు.
ఈ సందర్భంగా 49 రోడ్ల ని ర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూ చనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అ వాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేం దుకు వీలుగా రహదారు ల నిర్మా ణం ఉండాలని సీఎం ఆదే శించా రు.
ఈ క్రమంలో విశాల ప్రజా ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం అన్నారు. అనుసంధాన రహ దారుల నిర్మాణం, ప్రస్తు తం ఉన్న రహదారుల విస్తరణ విష యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమం త్రి రేవం త్ రెడ్డి అధికారులకు సూ చించా రు. ఆయా రహదారుల నిర్మాణం తో ప్రయాణికుల ఇబ్బందులు తొల గిపోవడంతో పాటు వారికి సమ యం కలిసి వచ్చేలా ఉండాలని, ఈ క్రమంలో అదనపు భూ సేకరణకు కొంత అధిక వ్యయమైనా వెనుకాడ వద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సమీక్షలో ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేం దర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు (మౌలిక వసతులు) శ్రీనివాస రాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతి కుమారి, ముఖ్య మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హెచ్ ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మ ద్, పురపాలక, పట్టణభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిశోర్ తది తరులు పాల్గొన్నారు.