Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chikilam Mettle Ashok: హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

Chikilam Mettle Ashok: ప్రజా దీవెన, చిట్యాల: ప్రతి ఇంటి పై జాతీయ జెండా (National flag)ఎగురవేసి హర్ ఘ ర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చికిలం మెట్ల అశోక్ (Chikilam Mettle Ashok) అన్నారు.దేశ స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈనెల ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకుంటూ కుటుంబ సమేతంగా మీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా మీ బంధువులు ఇరుగు పొరుగు వారితో జాతీయ జండాను ఎగర వేయించాలని అన్నారు. మంగళ వారం చిట్యా ల పదో వార్డులో వార్డు (ward) ప్రజలతో కలిసి చికిలం మెట్ల అశోక్ జాతీయ జెండాలను ఆవి ష్కరించారు.ఈ కార్యక్రమంలో మహిళలు వృద్ధులు యువకులు పాల్గొన్నారు.