childhood friends : ప్రజా దీవెన, శాలిగౌరారo: శాలిగౌరారం మండలం మాదావరం (కాలన్) గ్రామానికి చెందిన జేరిపో తుల సంతోష్ తండ్రి ఇటివల అనారోగ్యంతో మరణించాడు. సంతోష్ బాల్య మిత్రులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి సంతా పాన్ని వ్యక్తం చేశారు. అదే గ్రామా నికి చెందిన దాసరి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయ పడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుం టున్నాడు.
ఈ సందర్భంగా 2007-2008 జడ్పీహెచ్ఎస్ మాధవరం (కలాన్) పదవ తరగతి బాల్య మిత్రులందరి సహకారంతో దాసరి శ్రీనివాస్ కు సోమవారం వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వేముల గోపీనాథ్,తీగల గోవర్ధన్,జేరిపోతుల నరేష్, నోముల మధు,కట్లకుంట్ల రవి, గద్దగూటి మహేష్ ,బొడ్డు పరమేష్,మెట్టు దామోదర్,దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.