–చినపాక లక్ష్మీనారాయణ
Chinapaka Lakshminarayana : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : భారత కార్మికోద్యమ నేత కామ్రేడ్ బీటీ రణదీవే వర్ధంతి ఏప్రిల్ 6 నుండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, కుల వివక్షకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుల వర్ధంతి, జయంతుల సందర్భంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన కార్యక్రమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు.
అందులో భాగంగా నల్గొండ జిల్లాలో అన్ని యూనియన్లు మండల కేంద్రాల్లో ఏప్రిల్ 6 బీటీ రణదీవే వర్ధంతి, 8,910 తేదీల్లో సామాజిక సంఘీభావ పండ్ సేకరణ, 10న విమల రణదీవే జయంతి, 11న మహాత్మా జ్యోతిబాపులే జయంతి, 13న సామాజిక న్యాయసాధన బైక్ ర్యాలీలు,14న అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించాలని కోరారు. మతోన్మాదం ప్రజల మధ్య విద్వేషాన్ని నింపుతుంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నాయి. కుల వివక్ష బుసలు కొడుతు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మహనీయుల స్ఫూర్తితో మతోన్మాదానికి, కులవ్యక్షకు, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టే చర్యలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాల్సిన బాధ్యతను తీసుకుందని అన్నారు. అందులో భాగంగా జరుగుతున్న సామాజిక న్యాయ సాధన క్యాంపైన్ ను జయప్రదం చేయాలని కోరారు.