–ఈ వానాకాలం నుండే రైతు భరో సా కింద ఎకరాకు రూ.7500 అమ లు చేయాలి
–నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య
Chirumarthi Lingaiah: ప్రజా దీవెన నకిరేకల్: రాష్ట్రంలో వానాకాలం నుండే రైతు భరోసా (Farmer Assurance) పథకం కింద ఎకరాకు రూ. 7500 పథకం అమలు చేయాలని నకిరే కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ (demand)చేశా రు. బుధవారం నకిరేకల్ పట్టణం లోని బీఆర్ఎస్ పార్టీ (brs) కార్యా లయం లో మీడియా సమావేశంలో మాట్లా డుతూ ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి, విధానాల రూపకల్పన మీద ఉండదా, ఇచ్చిన హామీని నెరవేచ్చేందుకు ఏడు నెల ల నుండి ముఖ్యమంత్రి, మం త్రుల కు తీరిక లేదా, ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు దెయ్యానికి భయపడి వెనకటికి గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారని విమర్శించారు. డిసెంబరు 9న రూ.15 వేల రైతు భరోసా (farmer assurance) అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీది రాతలే అని తేలిపోయిందన్నారు. ఇప్పుడు రైతుభరోసాకు విధి, విధా నాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి అని మల్లగుల్లాలు పడు తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఎందుకు రైతుభరోసాను పరిమితం చేస్తామని, సమీక్ష చేస్తా మని చెప్పలేదన్నారు. రైతు భరో సాకు దిక్కు లేదని, కౌలు రైతుల ఊసులేదని, రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడని ధ్వజమెత్తారు. వరికి రూ.500 బోన స్ వట్టి బోగస్ అని తేలిపోయింద ని, ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉం టే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలన్నారు.
కేవలం కాలయాపన కోసమే శాస నసభ సమావేశాలు అంటూ ఊదర గొడుతున్నదన్నారు. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతుభరోసాపై (Farmer Assurance) తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతుకూలీలకు రూ.12000, కౌలు రైతులకు రూ.1 5000 ఇవ్వడంపై స్పష్టతనివ్వా లని, అబద్దపు హామీలతో అధికా రం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచు తున్నదని,ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ (demans)చేశారు. ఈ కార్య క్రమం లో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ రావు, కేత పల్లి మండల పార్టీ అధ్యక్షుడు మా రం వెంకట్ రెడ్డి, నడికుడి వెంకటే శ్వర్లు తదితరులు ఉన్నారు.