Christian Day celebrations ప్రజాదీవన ,కోదాడ: పట్టణంలోస్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో (Baptist Church) బుధవారం భారతీయ క్రైస్తవ దినోత్స వేడుకలను యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ (United Christians and Pastors) అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కోప్సిల్ సభ్యురాలు ఒంటిపాక జానకి యేసయ్య పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఒంటెపాక జానకి యేసయ్య మాట్లాడుతూ ఏసుప్రభు 12 మంది శిష్యులలో ఒకరైన అపోస్తుడైన పరిశుద్ధ తోమా క్రీస్తు శకము 72వ సంవత్సరంలో జూలై మూడున తారీఖున హత్య చేయబడ్డాడని అందుకు గుర్తుగా దేశంలో ఉన్న క్రైస్తవులంతా భారతీయ క్రైస్తవ దినోత్సవ కార్యక్రమాన్ని (Christian Day program) నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు జులై మూడో తారీకు ప్రతి చర్చిలోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ వి యేసయ్య, కోదాడ , సీనియర్ పాస్టర్ రెవ సిహెచ్ లూకా కుమార్, క్రైస్తవ నాయకులు పంది తిరుపతయ్య పాస్టర్స్ శ్రీనివాస గౌడ్ కర్ల ప్రభుదాస్, డేవిడ్ రాజ్, చిలుకూరు అబ్రహం, పౌలు చారి, వినోద్,విజయానంద్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.