ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక నయా నగర్ లోని కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పిసిసి డెలికేట్ లక్ష్మీనారాయణ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కందుల కొటేషర్ రావు 13వ వార్డు కౌన్సిలర్ లంకెల రమాదేవి నిరంజన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు క్రైస్తవులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చర్చ్ పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ డిసెంబర్ 25వ తారీకు క్రీస్తు జననం యొక్క ప్రాధాన్యత గురించి బైబిల్ లోని దేవుని వాక్యాలు ఉపదేశించారు.
ఈ ప్రత్యేక ప్రార్థనలు పాటలతో దేవుని స్తుతించి కొరవత్తుల సర్వీసింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ శ్రీమతి వంటెపాక జానకి ఏసయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు బొల్లి కొండ కోటయ్య, గిరిజన ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు జగ్గు నాయక్ హెడ్ కానిస్టేబుల్ జాన్ సోంపంగు నాగేశ్వరరావు రామకృష్ణ విజయానంద్ మోజెస్ రాంబాబు ద్రాక్షావల్లి సునీత సుధ కోటి తదితరులు పాల్గొన్నారు