CI Anil Kumar: అనధికారికంగా ప్రెస్, పోలీస్, ఆర్మీ స్టిక్కర్ వేసుకున్న వారికి ఝలక్.. కఠిన చర్యలు తప్పవన్న పోలిస్
CI Anil Kumar: ప్రజా దీవెన, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రామగుండం సిపి, ట్రాఫిక్ ఏసిపి (CP, Traffic ACP) ఆదేశాల మేరకు అయ్యప్ప టెంపుల్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ (CI Anil Kumar)నేతృత్వంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.ధ్రువీకరణ పత్రాలు (Validation documents) లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు ప్రెస్ పోలీస్ ఆర్మీ వాహనాలపై అనాధికారంగా స్టిక్కర్ వేసుకున్న వాహనాలను వారి చేతనే తొలగింప చేశారు వాహనాలపై జరిమాణాలు విధించారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు (Road safety rules, traffic regulations) ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు , లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.