CI K. Kondal Reddy : ప్రజా దీవెన శాలిగౌరారం ఫిబ్రవరి 10 : నేటి యువత చెడు వ్యాసనాలకు బానిస కాకుండా సన్మార్గం లో పయనించి అన్ని రంగాల్లో రాణించాలని శాలిగౌరారం సీఐ కె. కొండల్ రెడ్డి అన్నారు. నల్గొండ పోలీస్ శాఖ నిర్వహించిన మిషన్ పరివర్తన-యువతేజం కార్యక్రమం లో భాగంగా శాలిగౌరారం జడ్పి స్కూల్ ఆవరణలో కబడ్డీ క్రీడోత్సవాలు ఇటీవల నిర్వహించారు.బహుమతి ప్రధానోత్సవం వల్లాల మోడల్ స్కూల్ లో సీఐ కొండల్ రెడ్డి ముఖ్య అతిధిగా గా పాల్గొని బహుమతులు అందజేశారు.
కబడ్డీ వల్లాల మోడల్ స్కూల్ జట్టు ప్రథమ బహుమతి సాధించిందిఈ జట్టుకు 5 వేల రూపాయలు, మెమంటో అందజేశారు. ద్వితీయ బహుమతి శాలిగౌరారం నేతాజీ యూత్ క్లబ్ జట్టు సాధించగా 2500 రూపాయలు, మెమోటో అందజేశారు. తృతీయ బహుమతి వల్లాల మోడల్ స్కూల్ కు లభించగా 15వందలు మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎస్ఐ డి. సైదులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్,పీడీలు గంగాధర అంజయ్య, జ్యోతి, బొడ్డు మల్లేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.