CI Ramu: ముస్లింల ఆరాధ్య దైవం మొహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల, కోదాడ పట్టణ ముస్లింల (Muslims) ఆధ్వర్యంలో.. నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కోదాడ పట్టణ సిఐ రాము (CI Ramu) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు షేక్ నయిం మాట్లాడుతూ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టే విధంగా ముస్లింల ఆరాధ్య దైవం అయినటువంటి మహమ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకులు (BJP leaders) యతి నర్సింగ్ ఆనంద్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు నర్సింగ్ ఆనంద్ ను వెంటనే ఉరి తీయాలని అతని పేరుమీద ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్ చేశారు. జమీయతుల్ ఉలుమా హింద్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ సాబ్ (Abdul Qadir Saab) ఆధ్వర్యంలో కోదాడ పట్టణ సిఐకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మౌలానా ముఫ్తీ అతర్,హామీద్ మౌలానా, మాజీ కౌన్సిలర్ షేక్ , నయీం ఎండి ఖజా, మొయినుద్దీన్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ మెంబర్ బాగ్దాద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ షుమియా షేక్ జహీర్ , అలీ, షేక్ భాజన్ ,ఎండి సుజావుద్దీన్, షేక్ నజీర్, కోదాడ ముస్లిం మత పెద్దలు గురువులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.